Share News

నాడు కుదరదని..నేడిచ్చేశారు!

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:41 AM

అధికారం మారింది.. అధికారులు మాత్రం మారలేదు.. నేటికీ ఆ వైపే ఉన్నారు.. నాడు నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనులకు నేటికీ కొమ్ముకాస్తున్నారు.ఈ సంఘటనే అందుకు ఉదా హరణ..

నాడు కుదరదని..నేడిచ్చేశారు!

నాడు ‘ఆంరధ్రజ్యోతి’ కథనం

బిల్లులు ఆపేసిన అధికారులు

నేడు గుట్టుగా చెల్లింపులు

నాటి అధికారులే నేటికీ

అయినా ఎందుకో మారారు

కలెక్టర్‌ తేల్చాలని డిమాండ్‌

రాజమహేంద్రవరం రూరల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అధికారం మారింది.. అధికారులు మాత్రం మారలేదు.. నేటికీ ఆ వైపే ఉన్నారు.. నాడు నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనులకు నేటికీ కొమ్ముకాస్తున్నారు.ఈ సంఘటనే అందుకు ఉదా హరణ.. గత ప్రభుత్వ హయాంలో కనీసం పంచాయతీల తీర్మానం కాకుండా రూ.1.30 కోట్ల తో ఇష్టానుసారం ఒక రోడ్డు వేసేశారు.. ఆ రోడ్డుపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో నాడు బిల్లులు ఆపేశారు.. అయితే ఈ ఐదు నెలల్లో ఏం జరిగిందో ఏమో కానీ.. అన్నీ తెలిసిన ఆ అధికారే గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు చెల్లించే శారు.. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.మనోళ్లే.. బిల్లులు చెల్లించేయండి.. ఈ మాట కూటమి ప్రభుత్వ నేతలకో, కార్య కర్తలకో కాదు.. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి నిధులతో నిబంధనలకు విరుద్ధంగా వేసిన రోడ్డుకు సంబంధించి రూ.1.30 కోట్లు చెల్లింపులు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయాయి. రాజమ హేంద్రవరం రూరల్‌ మండలం పరిధి హుకుం పేట,పిడింగొయ్యి, శాటిలైట్‌సిటీ పరిధి పిట్టలవారి చెరువు ప్రాంతం నుంచి ప్రైవేటు లే అవుట్ల (జనావాసాలు లేని) వెంబడి ఆదిత్య తక్ష ప్రై వేటు పాఠశాల వరకు 1183 మీటర్ల పొడవు గల సీసీ రోడ్డు ఉపాధి నిధులతో గత ప్రభుత్వ హ యాంలో నిర్మించారు.ఈ రోడ్డు నిర్మాణానికి మూడు గ్రామ పంచాయతీల తీర్మానం ఉండాల్సి ఉండగా ఒక్క పిడింగొయ్యి పంచాయతీ ప్రత్యేకా ధికారి,విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి జానా సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రూప్‌ చంద్‌ల తీర్మానంతో 2024 జూన్‌నెలలో రోడ్డు నిర్మాణం చేపట్టి పూర్తిచేశారు. గత ప్రభు త్వంలో ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపా లకృష్ణ, అప్పటి జిల్లా కలెక్టర్‌ మాధవీలత ఒత్తిడి చేయ డంతో తాము తీర్మానం చేశామని పంచా యతీ అధికారులు, వారంతా పెద్ద వాళ్లు కావ డంతో తామేమీ చేయలేక పనులు చేయాల్సి వచ్చిందని మండల పరిషత్‌, ఇంజనీరింగ్‌ అధికారులు నాడు చెప్పుకొచ్చారు. ఇదే విషయమై జూన్‌ 17న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘‘సర్కారు సొమ్ముతో షోకులు’’ అన్న శీర్షికన ఒక కథనం ప్రచురిత మైంది.దీనిపై సంబంధిత పనులకు సంబంధించి వర్క్‌ రికార్డింగ్‌ చేయబోమని ఇంజనీరింగ్‌ అధికా రులు, లేబరు కాం పోనెంట్‌, బిల్లులు నిలుపుదల చేస్తామని ఎంపీడీవో, ఎన్‌ ఆర్‌ఈజీఎస్‌ అధికా రులు తెలిపారు. సుమారు ఐదు నెలలు తిరిగే సరికి సీన్‌ రివర్స్‌ అయింది. వారంతా చుట్టాలై పోయారు.. ధనం మూలం ఇదం జగత్‌ అంటే ఇదే అనేలా..అప్పటి ఇంజ నీరింగ్‌ అధికారు లు,ఎంపీడీవో కూడా మారలేదు.గత ప్రభుత్వం లోను వీరే. ప్రస్తుతం వీరే ఉన్నారు.. అయినా గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు చేసేశారు. దీనిపై రకరకాల ఆరోపణలు వినిపిస్తు న్నాయి. నాడు ఆపిన బిల్లులు నేడు ఎలా చెల్లింపులు చేశారో తెలియక చాలా మంది తలలు పట్టుకుం టున్నారు.కలెక్టర్‌ ప్రశాంతి ఆ రోడ్డును పరిశీలించి బిల్లుల చెల్లింపులపై దృష్టి సారించాలని డిమాం డ్‌ చేస్తున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:41 AM