Share News

రోడ్లకు మహర్దశ!

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:43 AM

రహదారి మరమ్మతు పనులు ఉమ్మ డి జిల్లాలో పూర్తిస్థాయిలో త్వరలోనే ప్రారం భం కానున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల కోడ్‌ అమలులో ఉండడంతో కొన్నిచోట్ల జాప్యం జరిగింది. కోడ్‌ ముగిసిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మ తు పనులకు సంబంధించి టెండర్లను పిలవ డానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రోడ్లకు మహర్దశ!
సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు

ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు

రూ.127.48 కోట్లు మంజూరు

407 పనులకు టెండర్లు

377 పనులు ప్రారంభం

కోడ్‌తో ఆగిన 30 పనులు

13, 16 తేదీల్లో రీటెండర్లు

జనవరి నెలాఖరుకు గడువు

కలెక్టరేట్‌(కాకినాడ), డిసెంబరు 6(ఆంధ్ర జ్యోతి): రహదారి మరమ్మతు పనులు ఉమ్మ డి జిల్లాలో పూర్తిస్థాయిలో త్వరలోనే ప్రారం భం కానున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల కోడ్‌ అమలులో ఉండడంతో కొన్నిచోట్ల జాప్యం జరిగింది. కోడ్‌ ముగిసిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మ తు పనులకు సంబంధించి టెండర్లను పిలవ డానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 30 ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతు పనులకు టెండర్లకు ఆహ్వానం పలకనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.127.48 కోట్లతో 407 పనులు చేయాలని ఎన్నికల కోడ్‌కు ముందు టెండర్లను ఆహ్వానించారు. కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు రావడంతో 377 పనుల వరకు ఖరారు చేశారు. వీటిలో తొలి ఫేజ్‌లో 172 రోడ్డు మరమ్మతు పనులు ప్రా రంభించారు. తర్వాత ఫేజ్‌లో మిగిలిన 205 పనులను మొదలుపెట్టారు. ఇటీవల ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో 30 పనులకు సంబంధించి టెండర్లు ఖరారు కాలేదు. ఉ మ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పనులకు ఈనెల 13,16వ తేదీల్లో టెండర్లకు ఆహ్వానం పలకాలని ఆర్‌అండ్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 12వ తేదీతో ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ముగియనుంది. దీంతో నిర్ధేశించిన షెడ్యూల్‌ ప్రకారం టెండ ర్లను పిలుస్తున్నారు. టెండర్లు పిలిచిన తర్వా త అగ్రిమెంట్లు చేసుకుని ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతు పనులను చేపట్టనున్నారు.

గత ప్రభుత్వంలో అధ్వానం..

గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు మర మ్మతు పని కూడా చేయలేదు. దీంతో ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహ దారులు అధ్వానంగా దర్శనమిచ్చాయి. ఉమ్మ డి జిల్లా వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. వర్షం పడితే గుంతల రోడ్లపై ప్రయా ణించలేక వాహనదారులు ప్రమాదాల బారి నపడ్డారు. ఐదునెలల కిందట కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల దశ మారింది. రోడ్ల మరమ్మతులకు పెద్దఎత్తున నిధులు విడుదల చేశారు. దీంతో రోడ్లపై గతుకుల బాధ తప్పుతోంది. ఉమ్మడి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం తో పాటు ఇతర పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి.

తుఫాన్ల వల్ల జాప్యం

గత రెండు నెలల్లో సంభవించిన తుఫాన్ల వల్ల మరమ్మతు పనులు చేయడానికి ఆటం కాలు ఏర్పడ్డాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల కొంతవరకు జాప్యం జరిగినట్టు అధికా రులు చెప్తున్నారు. ప్రస్తుతానికి వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల పనుల వేగం పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ విషయమై కాకినాడ సర్కిల్‌ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జి.కంఠును ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదిం చగా పెండింగ్‌లో ఉన్న పనులకు కోడ్‌ ము గిసిన వెంటనే టెండర్లు పిలుస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా మొత్తం మరమ్మతు పనులు పూర్తి చేసేలా కార్యాచ రణ అమలు చేస్తున్నామన్నారు. ఈ పనులు చేసేందుకు నిధులు సిద్ధంగా ఉన్నాయని, అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి నిర్దేశిత సమయానికి ఆర్‌అండ్‌బీ రోడ్డు మర మ్మతు పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

Updated Date - Dec 07 , 2024 | 12:43 AM