Share News

కొత్తూరు-వెదురుమూడి రోడ్డు పనులు ప్రారంభం

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:39 AM

అఽధ్వానంగా ఉన్న కొత్తూరు-వెదురుమూడి రోడ్డు కు ఎట్టకేలకు మరమ్మతులు ప్రారంభించారు.

కొత్తూరు-వెదురుమూడి రోడ్డు పనులు ప్రారంభం

ఆలమూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అఽధ్వానంగా ఉన్న కొత్తూరు-వెదురుమూడి రోడ్డు కు ఎట్టకేలకు మరమ్మతులు ప్రారంభించారు. వీటి మరమ్మతులకు రూ.40లక్షలు మం జూరు కావడంతో గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యా నందరావు వీటి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రోడ్డు పనులు తక్షణం ప్రారంభించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి గుం తలు లేకుండా చేయడానికి నిధులు కేటాయించారన్నా రు. రానున్న సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:39 AM