పుష్కరాలపై దృష్టి పెడతా
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:16 AM
: రుడా చైర్మన్ పదవి తనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెట్టిన భిక్షగానే స్వీకరిస్తున్నానని రాజమహేంద్రవరం అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ(రుడా) చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు.
రాజానగరం/కోరుకొండ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రుడా చైర్మన్ పదవి తనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెట్టిన భిక్షగానే స్వీకరిస్తున్నానని రాజమహేంద్రవరం అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ(రుడా) చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. రుడా చైర్మన్‌గా కూటమి ప్రభుత్వం ప్రకటించిన తరు వాత తొలిసారిగా ఆదివారం బీవీఆర్ స్వగ్రా మమైన పెద్దాడ నుంచి కోరుకొండ లక్ష్మీనరసిం హస్వామిని దర్శించుకునేందుకు ర్యాలీగా బయ లుదేరారు.ఈ మేరకు రాజానగరంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు గజమాలలు, బాణసంచాల కాల్పులతో ఘన స్వాగతం పలికారు. తూర్పు గోనగూడెం శివాలయం,దోసకాయలపల్లి ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు చేశారు.అనంతరం ఆయన కోరుకొండ శ్రీ లక్ష్మినరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.అక్కడ జరుగుతున్న కార్తీక అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.గతేడాది కాలంగా పార్టీ కార్యక లాపాల్లో తన వెంట ఉంటూ తమలో ఒకరిగా భావించి తన వెన్నంటే ఉంటున్న కూటమి నాయకులు, కార్యకర్తలు ఆదరాభిమానాలతోనే సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకుడు లోకేశ్ తనకు ఈపదవి కట్టబెట్టి నట్టుగా భావిస్తున్నానన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిం చేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తాన న్నారు. రుడా చైర్మన్ పదవి ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కంటే నాగ కేశవరావు, గంగిశెట్టి చంటిబాబు, రొంగల శ్రీనివాస్, మార్ని రాము, మార్ని వీరాంజనేయులు, ధారా రాంబాబు, దోసకాయలపల్లి సర్పంచ్ ధారా యశోదమ్మ, కటకం చలం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు గంగిశెట్టి చంటి బాబు, కంటే కేశవరావు, జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, తెలుగు యు వత జిల్లా అధ్యక్షుడు కందుల బాబూరాయువు, నాయకులు నీలపాల అరవరాజు, బత్తుల త్రి మూర్తులు, నూనె వెంకన్న, మద్దిరెడ్డి చిన వెంకటేశ్వరరావు, పెద్దిశెట్టి నారాయణస్వామి, నాతిపాం జాన్ తదితరులు పాల్గొన్నారు.