రుడా నిధులు హాంఫట్!
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:04 AM
వైసీపీ హయాంలో అంతా వారిష్టమే.. కావాలంటే పను లు చేశారు.. లేదంటే బిల్లులు చేయించేసుకున్నా రు..ఎక్కడికక్కడ ఆక్రమించేసి ఇష్టానుసారం భవ నాలు నిర్మించేసుకున్నారు. అయినా అడిగే నాథు డు లేదు..
అసంపూర్తిగా పనులు
అయినా బిల్లులు మంజూరు
అనపర్తి చెరువులో తినేశారు
కళావేదికలో మింగేశారు
వైఎస్ విగ్రహం చుట్టూ సుందరీకరణకు రుడా నిధులే
సాగుతున్న అక్రమ నిర్మాణాలు
నేటికీ అడ్డుకోలేని అధికారులు
కొత్త రుడా కార్యవర్గంపై ఆశలు
అనపర్తి,నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ హయాంలో అంతా వారిష్టమే.. కావాలంటే పను లు చేశారు.. లేదంటే బిల్లులు చేయించేసుకున్నా రు..ఎక్కడికక్కడ ఆక్రమించేసి ఇష్టానుసారం భవ నాలు నిర్మించేసుకున్నారు. అయినా అడిగే నాథు డు లేదు.. గత ఐదేళ్లు పట్టించుకున్నవారు లేరు. జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రుడా పరిధిలో ఉన్నా అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది.. ఇటీవల అనపర్తిలో వెలుగుచూసిన సంఘటన మరో ఉదాహరణ..గత వైసీపీ హయాంలో రాజమహేంద్రవరం రూరల్ డవలప్ మెంట్ అఽథారిటీ పేరుతో ఏర్పాటు చేసిన రుడా సంస్థ పరిధిలో చేపట్టిన అనేక నిర్మాణాలు కళ్ళకు కట్టినట్లు సాక్షీ భూతాలుగా నిలుస్తున్నాయి.
నాడు నాసిరకంగా పనులు..
రుడాకు సమ కూరిన సొమ్ముల్లో కొంత భాగా న్ని గ్రామాభివృద్ధికి మంజూరు చేస్తారు. పార్కు లు, ప్రధాన కూడళ్ళలో సుందరీకరణ వంటి పనులు చేస్తారు. గత ప్రభుత్వంలో అనేక నిధు లు కేటాయించి నాసిరకంగా పనులు చేసి దోచు కున్నారు.అనపర్తి నియోకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో రుడా నిధులతో నిర్మాణాలు చేపట్టిన అనేక చోట్ల అవినీతి రాజ్యమేలిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపిస్తూ వీటి పై విచారణ చేయాలని అధికారులను కోరారు. రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజా నగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇళ్ల స్థలాల్లో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా గళమెత్తారు.అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిని ప్రస్తుత పాలకులు ప్రశ్నిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా నిధులు..
బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం లో పెద్ద చెరువును అభివృద్ధి చేయాలన్న తలం పుతో రూ.1.50 కోట్ల నిధులను మంజూరు చేయిం చారు.ఈ నిధులతో ట్యాంక్‌ను శుభ్రపరచడం.. గట్టును పటిష్ట పర్చడం, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం,చిన్నారులు ఆడుకు నేందుకు పార్కును ఏర్పాటు చేయడం వంటి పనులకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కాంట్రా క్టరు కు పనులను అప్పగించారు. అయితే ఈ పనుల పర్యవేక్షణ రుడా రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించింది.బలభద్రపురం మెట్ట ప్రాంతంలో దిగువ గ్రామం కావడంతో భారీ వర్షాలకు పైనున్న చెరువులు పొంగితే బల భద్రపురంలోని పెద్ద చెరువు గ్రామానికి కాపుకా యడంతో పాటు గ్రామాన్ని ముంపునకు గురి కాకుండా రక్షించేది.అయితే చెరువు అభివృద్ది పనుల్లో భాగంగా చెరువుకు నీరు వచ్చే మార్గాన్ని ..నీరు బయటకు వెళ్లే మార్గాన్ని మూసి వేయడంతో భవిష్యత్‌లో వరదలు వస్తే గ్రామాన్ని రక్షించే పెద్ద చెరువు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు వాపోతున్నారు. అంతే కాకుండా పూర్తి స్థాయిలో పనులు చేయ కుండానే బిల్లులు చెల్లింపు జరగడం గమనార్హం. దీనిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధి కారులు, కాంట్రాక్టరును ప్రజల వద్దకే రప్పించి చెరువు అభివృద్ధి పనులపై సమీక్ష చేయడంతో అనేక అవకతవకలు బయటపడ్డాయి. అనపర్తి నడి బొడ్డున ఉన్న కళావేదిక అభివృద్ధికి రుడా నుంచి రూ.39 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు రాజమహేంద్రవరానికి చెందిన కాం ట్రాక్టరే చేపట్టారు. కళా వేదికకు రెండు వైపులా గోడల నిర్మాణం, సుమారు 20 కిటికీలు, ఐదు గుమ్మాలను యుపీవీసీతో ఏర్పాటు చేసేందుకు రూ.39 లక్షలు మంజూరు చేశారు. ఇంత చిన్న పనికి రూ.39 లక్షలా అంటూ గ్రామస్థులు ము క్కున వేలేసుకుంటున్నారు. అనపర్తి కెనాల్ రోడ్డు లో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద రుడా నిధులు సు మారు 20 లక్షల పైబడి నిధులు వెచ్చించారు. అక్కడ మొక్కలు నాటడం, వాటర్ పౌంటేయిన్ ఏర్పాటు చేయడం మినహా అభివృద్ధి చేసిందే ముందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇలా జిల్లా లో అనేక చోట్ల రుడా నిధులు పక్కదారి పట్టా యన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజమహేం ద్రవరం రూరల్ ధవళేశ్వరం గ్రామంలో అనేక అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నా యి. మెయిన్‌రోడ్డును ఆనుకుని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.నూత నంగా రుడా బాధ్యతలు చేపట్టబోతున్న కార్యవర్గం గతంలో జరిగిన పనులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని.. అక్రమ నిర్మాణాల బాధ్యులపై చర్య లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణం కూల్చివేత
గోకవరం, నవంబరు20(ఆంధ్రజ్యోతి): గోక వరం మండలం కృష్ణుడిపాలెం గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డుగోలుగా నిర్మిం చిన అక్రమ కట్టడాన్ని బుధవారం అధికారులు కూల్చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపం (కొత్తూరు రోడ్డు)లో ఉన్నటువంటి ఖాళీ స్ధలంను కొంతకాలం కిందట కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. అప్పటి పంచా యతీ కార్యదర్శి శివయ్య ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అప్పటి ఎంపీడీవో పద్మజ్యోతి ఆక్రమిత స్థలాన్ని పరిశీలించారు. స్థలం ఆక్రమణ సరికాదని ఆదేశాలి చ్చారు. అయి నప్పటికీ గ్రామానికి చెందిన కొందరు రేకుల షెడ్ నిర్మించారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రస్తు త ఎంపీడీవో గోవింద్ ఆదేశాలతో పంచాయితీ కార్యదర్శి రమణ కుమారి పోలీసుల సహకారంతో అక్రమ కట్ట డా న్ని కూల్చి స్థలాన్ని అంగన్‌వాడీకి అప్పగించారు.