Share News

రుడాను వదల్లేదు!

ABN , Publish Date - Dec 20 , 2024 | 11:51 PM

వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఏం జరిగింది.. ఏం చేశారు.. ఏదో చేస్తున్నట్టు హడావుడి చేశారే తప్ప చేసిందేం లేదు.. నిధులను మాత్రం దర్జాగా పక్కదారి పట్టించేశారు..

రుడాను వదల్లేదు!
రుడా కార్యాలయం

రూ.22 కోట్లకు లెక్కలేదు..

ట్రెజరీ అకౌంట్‌ నుంచి మాయం

జగన్‌ సభ ఖర్చు రుడాదే

కొవ్వూరు సభకు రూ.50 లక్షలు

కలెక్టర్‌ బంగ్లాకు రూ.3.5 కోట్లు

మూడేళ్లలో జరగని ఆడిట్‌

కూటమిలో రుడా ఆడిట్‌

బయటకొస్తున్న వాస్తవాలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఏం జరిగింది.. ఏం చేశారు.. ఏదో చేస్తున్నట్టు హడావుడి చేశారే తప్ప చేసిందేం లేదు.. నిధులను మాత్రం దర్జాగా పక్కదారి పట్టించేశారు.. రుడా సంఘటనే దానికి ఉదాహరణ.. రుడాకు సంబంధించిన నిధులు రూ.22 కోట్లు ఏమయ్యాయో నేటికీ తెలియదు.. ఎందుకంటే మూడేళ్లుగా ఆడిట్‌ జరగలేదు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆడిట్‌ నిర్వహిస్తే అసలు బాగోతం బయటపడింది.. ఇంతేనా ఇంకేమైనా ఉందా అనేది ప్రస్తుతం కూపీ లాగుతున్నారు.. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు కొదువే లే దు..నిధులు పక్కదారి పట్టించడంలో గత వైసీపీ ప్రభుత్వం ఓ రికార్డు సాఽధించింది. పల్లె నుంచి పట్టణం వరకూ ఎక్కడ నిధులున్నా ఖజానాకు వెళ్లిపోవాల్సిందే. లెక్కా పత్రం ఉండేది కాదు.. నిబంధనలు తుంగలో తొక్కి నిధులు బొక్కేసిన తీరు చూసి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విస్తు పోతున్నారు.అభివృద్ధిని పట్టించుకోకుండా, మౌలి క సదుపాయాలు కల్పించకుండా,పన్నులు, ఇతర ఫీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభు త్వం వాడేసుకోవడం గమనార్హం. దీనికి ఉదాహరణే రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథా ర్టీ(రుడా)..రుడా నిధులు పక్కదారి పట్టించి టోపి పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జగన్‌ పర్యటన ఖర్చు రుడాదే..

వైసీపీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తు న్నాయి. గత మూడేళ్లలో రుడా లావాదేవీలపై ఆడిట్‌ జరగలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆడిట్‌ చేశారు. దీంతో ఇక్కడ లోపాలన్నీ వెలుగు చూస్తున్నాయి. రుడా పరిధిలోని లేఅవుట్లు, ఇతర భవనాలకు సం బంధించి వసూలు చేసే ఫీజును జమ చేయడా నికి రెండు అకౌంట్లు ఉంటాయి. ఒకటి మెయిన్‌ అకౌంట్‌, రెండోది ట్రెజరీ పరిధిలో ఉండే పీడీ అకౌంట్‌. ఈ అకౌంట్‌తో అభివృద్ధి పనులు చేయా లి. కానీ ఇందులో రూ.22 కోట్లను రుడా అను మతి కూడా తీసుకోకుండా నేరుగా వాడేశారు. తర్వాత దాని ఊసే లేదు. ఆ డబ్బంతా ఉంటే రుడా పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరిగేవి. ఈ విషయాన్ని ఇటీవల రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లినట్టు సమాచారం. దీనిపై కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి. ఇక కలెక్టర్‌ బంగ్లాకు రుడా సొమ్ము రూ.3.5 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతూ వచ్చారు. గతంలో జగన్‌ కొవ్వూరు డివిజన్‌లో పర్యటనకు వచ్చిన సందర్భంగా అక్కడ ఏర్పాట్ల కు రూ.50 లక్షలు రుడా నుంచి లాగేశారు. వాటిని రీఎంబర్స్‌ చేస్తామని అప్పట్లో చెప్పినా తర్వాత దాని ఊసే ఎత్తకపోవడం గమనార్హం. సాధారణంగా ప్రతి ఏడాది ఆ సంవత్సరంలో జరి గిన ఆర్థిక లావాదేవీలపై ఆడిట్‌ జరగాలి. కానీ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఆడిట్‌ జరగక పోవడం గమనార్హం. గతంలోనే ఆడిట్‌ చేసి ఉంటే ట్రెజరీ నుంచి రూ.22 కోట్లు ప్రభుత్వం వాడేసుకోవడం, జగన్‌ పర్యటకు రూ.50 లక్షలు వాడడం వంటి వ్యవహారాలన్నీ బయటకు వచ్చే వి. అసలు జగన్‌ పర్యటనకు ఈ నిధులు ఎలా ఇచ్చారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అభివృద్ధి, ప్లానిం గ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు వినియోగించాల్సిన నిధులను ఇలా దారి మళ్లించడం వల్ల రుడా సొమ్ము వృఽథా అయినట్టు ఉందనే విమర్శలు వస్తున్నాయి.

మూడేళ్లు.. ఏ ప్లానూ లేదు..

రుడా పరిధిలో కొన్ని ప్లాన్‌లు ఉంటాయి. పర్పెక్టివ్‌ ప్లాన్‌, మాస్టర్‌ప్లాన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవ లప్‌మెంట్‌ ప్లాన్‌, రీజినల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ ఉంటుంది. కానీ గత రుడా పరిధిలో ఈ ప్లాన్‌ లు అసలు జరగలేదు. మాస్టర్‌ ప్లాన్‌ కూడా లేదు. దీని వల్ల ఇటీవల అర్బన్‌ ఏరియా అభి వృద్ధికి కేంద్రం నిధులు రావాలంటే మాస్టర్‌ ప్లాన్‌ అవసరం ఉంది.ప్రస్తుత రుడా అధికారులు చేసే దేమీలేక 2019కి ముందు గోదావరి అర్బన్‌ డెవ లప్‌మెంట్‌ అథార్టీ(గుడా)గా ఉన్న సమయంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను రాజమండ్రి సిటీ, దానిని పరిసర ప్రాంతాలకు చెందిన ప్లాన్‌ పం పించినట్టు సమాచారం. దీంతో రుడా పరిధిలోని విస్తీర్ణమంతా ఈ మాస్టర్‌ ప్లాన్‌లో లేదు. ప్రస్తు తం రాజమండ్రి, కొవ్వూరు డివిజన్లతో పాటు కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియో జకవర్గాల్లో కొంత ప్రాంతం కూడా రుడా పరి ధిలో ఉంది. కానీ అధికారులు హడావిడిగా పంపిన ఈ ప్లాన్‌లో చాలా విస్తీర్ణం లేకపోవడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టి ఉంటే ఇవాళ మాస్టర్‌ ప్లాన్‌ కూడా లేని దుస్థితి వచ్చి ఉండేది కాదనే విమర్శలున్నాయి.

ప్రస్తుత పాలకవర్గం రూటెటు..

ప్రస్తుత పాలకవర్గం గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన సొమ్మును ఎలా తిరిగి తెస్తుందో చూడాలి మరి.ఇంకా కొన్ని పనుల్లో బాధ్యతా రాహి త్యంగా వ్యవహరించినట్టు విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల జిమ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణపై సందిగ్ధత నెలకొనడంతో కొద్దిరోజుల తర్వాత ఈ జిమ్‌ల పరిస్థితి ఏంటనేది ప్ర శ్నార్థకంగా ఉంది. ప్రస్తుతం రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ గత ప్రభుత్వ అవకతవలపై ఎటు వంటి చర్యకు ఉపక్రమిస్తారో వేచిచూడాల్సిందే.

Updated Date - Dec 20 , 2024 | 11:51 PM