Share News

శరవేగంగా ‘సాగరమాల’!

ABN , Publish Date - Nov 11 , 2024 | 01:23 AM

కాకినాడ జిల్లా సామర్లకోట-కాకినాడ మధ్య ‘సాగరమాల’ ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

శరవేగంగా ‘సాగరమాల’!

సామర్లకోట, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట-కాకినాడ మధ్య ‘సాగరమాల’ ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సామర్లకోట ఏడీబీ రోడ్డు రాక్‌ సిరామిక్‌ సమీపం నుంచి ఎఫ్‌సీఐ గోదాముల వెనుక నుంచి చక్కెర కర్మాగార యార్డు, భీమేశ్వరాలయం వెనక నుంచి ఉండూరు సమీపాన తిరిగి ఏడీబీ రోడ్డుకు అనుసంధానం చేస్తూ పనులు చకచకా నిర్వ హిస్తున్నారు. చక్కెర కర్మాగార యార్డు నుంచి గోదావరి కాలువపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ వంతెన పనుల్లో భాగంగా ఆర్‌సీసీ గడ్డర్లను వంతెన స్తంభాలపై చేర్చే అతిక్లిష్టమైన పనులను ఆదివా రం నిర్వహించారు. కెనాల్‌ రోడ్డులో కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేసి వంతెనకు ఇరువైపులా ఒక్కొక్కటీ 150 టన్నుల సామర్ధ్యంతో రెండు భారీ క్రేన్‌లతో ఆర్‌సీసీ గడ్డర్లను ఏర్పాటు చేశారు. రూ.230కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సాగర మాల రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తు న్నారు. 10కిలోమీటర్ల పొడవుగల ఈ జాతీయ రహదారి ఫోర్‌లైన్లు రోడ్డుగా విస్తరించనుంది. సామర్లకోట పట్టణ శివారున రైలు పట్టాలు దాటుతూ, చక్కెర కర్మాగార యార్డు మీదుగా కెనాల్‌రోడ్డు, గోదావరి కాలువలను దాటేందుకు రెండు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. భీమే శ్వరాలయం వెనకనుంచి వ్యవసాయ పరిశో ధనా కేంద్రం నుంచి ఏలేరు కాలువ, గోదావరి కాలువ, వీకే రాయపురం పంట కాలువలు కాకి నాడ రైల్వేట్రాక్‌ను దాటేందుకు మరో మూడు కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ వంతెనను నిర్మిస్తున్నారు. ఇప్పటికే వంతెనల నిర్మాణ పనులు 50శాతం పైబడి పూర్తి చేయగా అదే రీతిలో రోడ్డు నిర్మాణ పనులు సైతం నిర్వహిస్తున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 01:23 AM