Share News

ఇసుక.. క్యూ!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:50 AM

ఉచితమంటే ఊరు కుంటారా.. అవసరం ఉన్నా లేకపోయినా క్యూ కట్టేయరూ..! ఫ్రీగా వస్తే పెనాయిల్‌ కూడా వదలరనేది గోదావరి నానుడి..ఆ నానుడిని గత మూడు రోజులుగా నిజం చేస్తున్నారు. సీఎం చం ద్రబాబు నోట ఇసుక ఉచితం మాట అన్నప్పటి నుంచి అదే చేస్తున్నారు.

ఇసుక.. క్యూ!
దారెటు : కడియం మండలం బుర్రిలంక ర్యాంపు వద్ద ట్రాక్టర్లు

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా

సీఎం హామీతో గందరగోళం

ర్యాంపులకు భారీగా ట్రాక్టర్లు

ఇల్లు కట్టుకోనివారు క్యూ

యథేచ్ఛగా ఇసుక తరలింపు

ఖాళీ ప్రదేశాల్లో డంప్‌

రాత్రికి ఇసుక అమ్మకాలు

కరువైన పర్యవేక్షణ

అడ్డుకోని అధికారులు

రాజమహేంద్రవరం/పెరవలి/సీతానగరం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఉచితమంటే ఊరు కుంటారా.. అవసరం ఉన్నా లేకపోయినా క్యూ కట్టేయరూ..! ఫ్రీగా వస్తే పెనాయిల్‌ కూడా వదలరనేది గోదావరి నానుడి..ఆ నానుడిని గత మూడు రోజులుగా నిజం చేస్తున్నారు. సీఎం చం ద్రబాబు నోట ఇసుక ఉచితం మాట అన్నప్పటి నుంచి అదే చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా లో ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. నిబంధనలు మీరి తరలించేస్తున్నారు. దీంతో ఉచిత ఇసుక విధానం గందరగోళంగా మారింది.అవసరం మేర కు ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లతోనూ ఇసుక తవ్వుకుని తీసుకుని వెళ్లొచ్చని సీఎం నారా చం ద్రబాబునాయుడు చేసిన ప్రకటన ప్రజల్లోకి తప్పుగా చేరినట్టు ఉంది.తూర్పుగోదావరి జిల్లాలో పలు ర్యాంపులు, లంకల్లోకి వందల కొద్దీ ట్రాక్ట ర్లతో ప్రజలు వచ్చి ఇసుక తవ్వుకుపోతున్నారు. రెండు రోజుల నుంచి ఇష్టానుసారం ఇసుక తవ్వే స్తున్నారు. వాస్తవానికి వాగులు, నదులకు సంబ ంధించిన పిల్ల పాయల్లో ఇసుకను సొంతింటి అవసరాలకు ఉచితంగా ట్రాక్టర్లతో తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కానీ గోదావరిలో కూడా ఉచితంగా ట్రాక్టర్లతో తవ్వుకోమని చెప్పినట్టు భావించిన ప్రజలు, ఇతరులు వందలకొద్దీ ట్రాక్ట ర్లను ఇసుక ర్యాంపుల్లోకి దింపి ఇష్టానుసారం ఇసుక తవ్వుకుపోతున్నారు. రెవెన్యూ, మైన్స్‌ అధికారులు ప్రశ్నిస్తే సీఎం గారే తవ్వుకోమంటే మీకేంటి అభ్యంతరం అని ప్రశ్నిస్తున్నారు. ప్రభు త్వం నుంచి స్పష్టత వచ్చే వరకూ ఏం చేయలే మని అధికారులు చేతులెత్తేశారు. వేమగిరి- కడి యపులంక ర్యాంపుల్లో మూడు రోజులుగా వం దల ట్రాక్టర్ల ద్వారా ఎవరికి నచ్చినట్టు వారు ఇసుక తవ్వుకుపోతున్నారు. గత రెండు మూడు రోజులుగా పెరవలి మండలం తీపర్రు ర్యాంప్‌ నుంచి ఎగుమతులు జరుగుతుండగా పెండ్యాల ర్యాంప్‌లో సోమవారం నుంచి తవ్వకాలు ప్రారం భం అయ్యాయి. రెవెన్యూ అధికారులు ర్యాంప్‌ల వద్దకు వెళ్లి ఆరా తీయగా సీఎం ప్రకటనతో ఇసు క ఎగుమతి చేస్తున్నామని చెప్పడం గమనార్హం. సీతానగరం మండలం వంగలపూడి ర్యాంపు లోనూ ట్రాక్టర్లు క్యూకడుతున్నాయి. ర్యాంపుల లోపలకు వెళ్లడానికి బాటలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కేవలం ఇళ్ళు కట్టుకునే వారికి మాత్ర మే అవసరానికి ఇసుక తీసుకువెళ్లడానికి అను మతి ఉన్నప్పటికి ఉదయం నుంచి రాత్రి వరకు ఖాళీ లేకుండా ట్రాక్టర్లు పరుగులు తీస్తున్నాయి. గ్రామాల్లో ట్రాక్టర్ల అతివేగంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై వివరణ కోరగా పెరవలి, సీతానగరం తహశీల్దార్లు అచ్యు త కుమారి,ఎ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ గృహనిర్మాణ అవసరాలకు మాత్రమే ఇసుక తీసుకువెళ్ళవచ్చు. ఇసుక నిల్వలకు అనుమతి లేదు. ముం దుగా ట్రాక్టరు నమోదు చేయించుకోవాలి. లైసెన్సులు లేని ట్రాక్టర్లు, పిల్లలు డ్రైవింగ్‌ చేసిన ట్రాక్టర్లను సీజ్‌ చేస్తాం.ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపును ఉన్నతాధికారులకు తెలియజేశాం.. ఆదేశాలు మేరకు నడుచుకుంటామని తెలిపారు.

పెండ్యాలలో ఇసుక మాఫియా..

నిడదవోలు, అక్టోబరు 22 (అంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పఽథకం కొందరు దళారులు వరంగా మార్చు కుంటున్నారు. సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ట్రాక్టర్ల ద్వారా ర్యాంపుల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చన్న ప్రభుత్వ విధానానికి తూట్లు పొడుస్తూ ఇసుక మాఫియా అక్రమా లకు తెరలేపింది. నిడదవోలు మండలం పెం డ్యాల ఇసుక ర్యాంపు నుంచి కొందరు ఇసుకా సురులు ఇసుక అక్రమ విక్రయాలకు తెరలే పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాక్టర్ల ద్వారా ర్యాంపుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లి పెండ్యాల, పరిసర గ్రామా ల్లోని ఖాళీ ప్రదేశాల్లో అనధికార స్టాక్‌ పాయిం ట్లు ఏర్పాటు చేసుకుని ఇసుకను డంప్‌ చేస్తున్నారు. రాత్రి కాగానే లారీల ద్వారా ఇసుక విక్రయాలు సాగిస్తున్నారు. ఫోన్‌కు డబ్బులు పంపితే లారీల ద్వారా ఇసుక ఇంటి ముంగి టకు చేరుస్తున్నారు. 20 టన్నుల ఇసుక లారీ ప్రభుత్వ ధరల ప్రకారం రూ.5400లు కాగా ఇసుకాసురులు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అవసరాన్ని బట్టి ధర నిర్ణయించి విక్ర యాలు సాగిస్తున్నారు. ఒక్క పెండ్యాల ఇసుక ర్యాంపు నుంచే రోజుకు సుమారు 300 ట్రాక్టర్లకు పైగానే ఉచితంగా ఇసుక తరలి స్తుండగా 100 ట్రాక్టర్లు రోజుకు మూడు ట్రిప్పు ల చొప్పున ఉదయం నుండి రాత్రి వరకు పెండ్యాల చుట్టు పక్కలే అనధికార ఇసుక డం ప్‌లకు తరలిపోతుంది. పెండ్యాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రం రోడ్డంతా అక్రమ ఇసుక నిల్వలకు అడ్డాగా మారిపోయింది. గ్రామంలోనే చిన్నా పెద్దా కలిపి సుమారు 40 నుండి 50 వరకు ఇసుక గుట్టలు ఉన్నాయి. పెండ్యాల ఇసుక ర్యాంపు నుంచి కొందరు అధికారులు, సిబ్బందికి భారీగా మామూళ్ళు అందుతున్నా యనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటి నిర్మాణానికే తరలించాలి..

ఉచిత ఇసుక విధానం అమలులో అవకతవక లకు పాల్పడినట్టు గుర్తించినా, అనుమతివ్వని ర్యాంపుల్లో తవ్వకాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 16 రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు జారీ చేశాం. ఉచిత ఇసుక విధానంలో జిల్లా యంత్రాంగం గుర్తింపు ఇచ్చిన ప్రాంతాల్లో మాత్రమే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పరిమితులకు లోబడి తీసుకు వెళ్లాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంటి నిర్మాణం,మరమ్మతులకు మాత్రమే ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకువెళ్లాలి. డంపు చేయడం, నిల్వ చేయడం కుదరదు.

- జేసీ ఎస్‌.చిన్నరాముడు

Updated Date - Oct 23 , 2024 | 12:50 AM