Share News

మామూళ్లు.. మామూలే!

ABN , Publish Date - Nov 11 , 2024 | 01:13 AM

ఇసుక దోపిడీ కొనసాగుతూనే ఉంది.. ప్రత్యక్షంగా పరోక్షంగా భవన యజమానుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు.

మామూళ్లు.. మామూలే!
తీపర్రు ర్యాంపులో ఏర్పాటు చేసిన బ్యానర్‌

దళారుల ఇష్టారాజ్యం

తీపర్రులో అదనపు వసూళ్లు

కలెక్టర్‌కు ఫిర్యాదు.. తనిఖీ

నోరుమెదపని వాహనదారులు

పెరవలి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఇసుక దోపిడీ కొనసాగుతూనే ఉంది.. ప్రత్యక్షంగా పరోక్షంగా భవన యజమానుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు. అయినా అడ్డుకట్ట వేసేవారే కానరావడంలేదు. కలెక్టర్‌ ఎన్ని హెచ్చరికలు చేసినా రీచ్‌ల వద్ద మామూళ్లు మామూలుగానే సాగుతున్నాయి..ఇప్పటికీ మీకెంత.. మాకెంత అన్నట్టుగా ఇసుక రవాణా సాగుతున్నట్టు సమా చారం. ప్రభుత్వం ఇసుకపై రూపాయి వద్దన్నా.. దళారీలు మాత్రం వదలడంలేదు. ఏదో ఒక విధంగా దోపిడీకి తెగబడుతూనే ఉన్నారు. శనివా రం కలెక్టర్‌ ప్రశాంతికి ఎదురైన సంఘటనే అం దుకు ఉదాహరణ. తీపర్రు ఇసుక ర్యాంప్‌లో లారీల వద్ద నుంచి వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ వసూలు చేసినట్టు కలెక్టర్‌ ప్రశాంతికి ఫిర్యాదు అందింది. దీంతో శనివారం ఆమె హుటాహుటిన తీపర్రు ర్యాంప్‌కు వచ్చారు. అయితే అక్కడ ర్యాంప్‌లో వాహనదారులు ఆమె వద్దకు వెళ్లి తమ వద్ద ఎక్కువ వసూలు చేసి నట్టు చెప్పకపోవడం విశేషం. దీంతో సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఎక్కువ డబ్బు లు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదు అందిం దని చెప్పగా నిర్ణయించిన ధర మాత్రమే వసూ లు చేస్తున్నామని సమాధానం ఇచ్చారు.దీంతో నిర్ణ యించిన ధరకంటే ఎక్కువ సొమ్ము వసూ లు చేస్తేచర్యలుతప్పవని హెచ్చరించి వెళ్లిపోయారు.

తీపర్రులో అదనంగా వసూళ్లు?

పెరవలి మండలం తీపర్రు ర్యాంపునకు పాలకొల్లు, భీమవరం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన లారీల నుంచి ఒక్కొక్క లారీకి రూ.2 వేలు చొప్పున వసూలు చేయాల్సి ఉండగా రూ. 5 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నట్టు ఆరో పణలు ఉన్నాయి.గోదావరిలో ఇసుకను కూలీలతో ఎగుమతి చేయించి ట్రాక్టర్లపై తెచ్చి దిగుమతి చేయించి జేసీబీలతో లారీలపై ఎగుమతి చేస్తున్నారు.దీంతో కాంట్రాక్టరుకు గిట్టు బాటు కావడం లేదు.ఈ నేపథ్యంలో కొంత ఎక్కు వ వసూలు చేయాల్సి వస్తుందని కొంత మంది చెబుతున్నారు.అయినప్పటికి నిర్ణయించిన ధర ప్రకారం వసూలు చేయాలని అదనంగా వసూ లు చేస్తే సహించేది లేదని కలెక్టర్‌ ప్రశాం తి హెచ్చరించారు.ఈ మేరకు తహశీల్దార్‌ అచ్యుత కుమారి శనివారం సాయంత్రం వరకు అక్కడే ఉండి లారీలు వద్ద అదనపు సొమ్ము వసూలు చేయకుండా నిర్ణయించిన ధర మాత్ర మే వసూలు చేసి ఎగుమతి అయ్యేలా చూశారు.

10 టన్నులు..రూ.960.20

ఒక టన్ను ఇసుకకు రూ.96.2, 4 టన్నులకు రూ.384.8 పైసలు, పది టన్నులకు రూ.960.20 పైసలు, 20 టన్నులకు 19.25పైసలు వసూలు చేయాలని బోర్డు ఏర్పాటు చే శారు. అదనం గా డబ్బులు వసూలు చేస్తే తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ర్యాంప్‌లో అం దరికీ కనపడే విధంగా బ్యానర్లు పెట్టారు. దీంతో లారీ యజమానులు, డ్రైవర్లు ఆనందంవ్యక్తం చేస్తున్నారు.ఆదివారం ప్రభుత్వ సిబ్బందికి సెలవు కావడంతో ఎగుమతి కాలే దు.సోమవారం లారీల నుంచి ఏ విధంగా సొమ్ములు వసూలు చేస్తారనేది చూడాలి.

ఇసుక అక్రమాలకు పాల్పడితే నాకు ఫిర్యాదు చేయండి : మంత్రి

నిడదవోలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఉచిత ఇసుక పఽథకం సక్ర మంగా అమలు జరగాలని మంత్రి కందుల దుర్గేష్‌ అ న్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశా రు. కొందరు అత్యాశపరులు ఉచిత ఇసుక పఽథకాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇసుక విక్రయాలు సాగిం చేందుకు ప్రయత్ని స్తున్నారన్నారు.అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే ఉచిత ఇసుక పఽథకం అమలు జరిగి తీరాలన్నారు. అత్యాశపరులు ఎవరైనా ఇసుక విక్రయాల్లో ఎవరి పేరు ఉపయోగించినా ఉపేక్షించేది లేదన్నారు. ఇసుకకు ధర లేదని.. రవాణాకు మాత్రమే చెల్లించాలన్నారు. ఎవరైనా నిబం ధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పోలీసు రెవెన్యూ అధికార్ల దృష్టికి తీసుకెళ్లాలని..లేదా నాకు ఫిర్యాదు చేసినా స్పందిస్తానన్నారు.

ఇసుక కొరత రానీయవద్దు : జేసీ

రాజమహేంద్రవరం,నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి):బోట్స్‌మన్‌ సొసైటీల సభ్యులంతా ఇసుక కొరత రాకుండా చూసుకోవాలని జేసీ ఎస్‌.చిన్నరాముడు ఆదేశించారు. ఆర్డీవో కార్యా లయంలో ఆదివారం 90 బోట్స్‌మన్‌ సొసైటీల సభ్యులతో ఇసుక సరఫరాపై సమీక్షించారు. నిర్మాణ పనులకు అంతరాయంలేకుండా ఇసు కను అందించాలన్నారు.బోట్స్‌మన్‌ సొసైటీలకు చెల్లించాల్సిన ఇసుకతీత డబ్బు ఆయా సొసైటీ బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా జమ చేస్తామన్నారు. ప్రతి రీచ్‌లో రోజుకు 1000 నుంచి 2000 మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు జరపాల న్నారు. ట్రాక్టర్‌ ద్వారా తీసుకెళ్లడానికి ఓపెన్‌ రీచ్‌లలో ఉచిత ఇసుక సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు.ప్రభుత్వానికి ఎటువంటి రుసుమ చెల్లించనవసరం లేదన్నారు.సమావేశంలో జి ల్లా మైన్స్‌ ఏడీ డి.ఫణి భూషణ్‌రెడ్డి,ఆర్డీవోలు ఆర్‌.కృష్ణ నాయక్‌, రాణి సుస్మిత పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 01:14 AM