Share News

ఇసుక రచ్చ రచ్చ!

ABN , Publish Date - Nov 13 , 2024 | 01:09 AM

ఉచిత ఇసుక విధానం వివాదాలకు దారితీస్తోంది. ప్రభుత్వం ఆదాయం కోసం ఆలోచించకుండా ఉచిత ఇసుకకు అవకాశమిస్తే అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు..

ఇసుక రచ్చ రచ్చ!
తీపర్రు ర్యాంపులో ఉచిత ఇసుక ట్రాక్టర్ల క్యూ

ఉచిత ఇసుకపై గందరగోళం

ఇవ్వలేమన్న కాంట్రాక్టర్‌

వేరే ర్యాంపులో తవ్వకాలు

దారివ్వకుండా ట్రాక్టర్ల అడ్డగింత

సర్దుబాటు చేసిన తహశీల్దార్‌

తీపర్రులో పశ్చిమ డిప్యూటీ కలెక్టర్‌

ఇసుక ఇవ్వాలని ఆదేశాలు

పెరవలి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఉచిత ఇసుక విధానం వివాదాలకు దారితీస్తోంది. ప్రభుత్వం ఆదాయం కోసం ఆలోచించకుండా ఉచిత ఇసుకకు అవకాశమిస్తే అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు..దీంతో అటు కాం ట్రాక్టర్లు.. ఇటు ఉచిత ఇసుక ట్రాక్టర్ల యజమా నుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. తాజా గా కోనసీమ జిల్లా రావుపాలెంలో ఇటీవల వివా దం తలెత్తగా అధికారులు సర్దుబాటు చేశారు. ప్రస్తుతం అటువంటి వివాదమే పెరవలి మండ లం తీపర్రులోనూ నెలకొంది. తీపర్రులో కాంట్రాక్టర్‌ తీసుకున్న ర్యాంప్‌ నుంచి గోదావరిలో ఇసు కను మంగళవారం ఉదయం ట్రాక్టర్లపై స్టాక్‌ పాయింట్‌కు తరలిస్తున్నారు.ఇదిలా ఉండగా ఆయా గ్రామాల నుంచి సుమారు 30 నుంచి 40 ట్రాక్టర్ల వరకు ఉచిత ఇసుక తీసుకు వెళ్లేందుకు ర్యాంపునకు వచ్చాయి. ట్రాక్టర్లకు ఇసుక ఎగుమతి చేయడానికి కాంట్రాక్టర్‌, బంటా కార్మికులు నిరాకరించినట్టు సమాచారం. దీంతో ఆ పక్కనే ఉన్న మరొక ర్యాంప్‌ నుంచి ఉచిత ఇసుక ఉచి తంగా తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌ యజమానులు సిద్ధమయ్యారు. ఉసులుమర్రు వైపు గల ఈ ర్యాంప్‌లో సుమారు 20 ట్రాక్టర్ల వరకు ఇసుకను ఎగుమతి చేస్తున్నారు.కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేసిన ర్యాంప్‌ నుంచి దిగిన ట్రాక్టర్లు వేరొక ర్యాంప్‌ద్వారా పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ ర్యాంప్‌ నుంచి ట్రాక్టర్లు కిందకు దిగడానికి వీల్లేదని ఇసుక కాంట్రాక్టు పొందిన వ్యక్తులు అక్కడ బాటకు అడ్డంగా మట్టి పోశారు. దీంతో వివాదం పెద్దదైంది.. ఇరువర్గాలు మాటామాటా అనుకున్నారు. ఈ మేరకు సమాచారం అంద డంతో తహశీల్దార్‌ అచ్యుతకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని అనుమతి పొందిన ర్యాంప్‌లో మాత్రమే ఉచిత ఇసుక తీసుకోవాలని వేరొక ర్యాంప్‌ ద్వారా ఇసుక తీసుకెళ్లడం కుదరదని పేర్కొన్నారు. దీంతో ట్రాక్టర్ల డ్రైవర్లు, యజామానులు తమకు ఆ ర్యాంప్‌ నుంచి ఉచిత ఇసుక ఎగుమతి చేయకపోవడం వల్లే వేరొక ర్యాంప్‌ నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నా రు.దీనిపై స్పందించిన తహశీల్దార్‌ గోదావరిలో ఇసుక ఏ ప్రాంతంలో ఏ మేరకు తీయాలనేది గ నుల శాఖ అధికారులు నిర్ణయించారని అం దు వల్ల అక్కడ మాత్ర మే ఇసుక తీయాలని చెప్పారు. తమకు ఆ కాంట్రాక్టర్‌ ఉచిత ఇసుక ఎగుమతి చేస్తే తమకు అభ్యంతరం లేదని ట్రాక్టర్‌ యజమానులు పేర్కొన్నారు.దీంతో త హశీల్దార్‌ ఆ కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఉచిత ఇసుక ఎగుమతి అయ్యేలా చూడాలని సూచించారు.

పశ్చిమకూ ఇసుక ఇవ్వండి

డిప్యూటీ కలెక్టర్‌ కతీఫ్‌ కౌసర్‌ భాను

పెరవలి, నవంబరు12(ఆంధ్రజ్యోతి): తీపర్రు ఇసుక ర్యాంప్‌లో పశ్చిమగోదావరి జిల్లాకు సం బంధించిన లారీలకు ఇసుక ఎందుకు ఎగు మతి చేయడం లేదంటూ తాడేపల్లిగూడెం డిప్యూటీ కలెక్టర్‌ కతీఫ్‌ కౌసర్‌ భాను ప్రశ్నించారు. తీపర్రు ఇసుక ర్యాంప్‌ను మంగళవారం పరిశీలించారు. ర్యాంపు నిర్వాహకులపై మండిపడ్డారు.ఇక్కడి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లారీలకు ఇసుక ఎగుమతులు జరగాల్సి ఉన్నప్పటికి ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. దీంతో లారీలకు ఎగుమతి చేయడానికి తగినంత స్టాక్‌ లేకపోవడం వల్ల గోదావరి నుంచి స్టాక్‌ పాయింట్‌కు ట్రాక్టర్లపై ఇసుక తరలిస్తున్నామన్నారు. స్టాక్‌ పాయింట్‌కు ఇసుక చేరుకున్న తరువాత ఎగుమతులు చేస్తామన్నారు.

ఇసుక సరఫరాకు ఇబ్బందులు కలిగించొద్దు

నిడదవోలు/కొవ్వూరు,నవంబరు 12 (ఆంధ్ర జ్యోతి) : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక ర్యాంపుల నుంచి బయటకు సరఫరా చేయాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. రాత్రి సమ యాల్లో ర్యాంపుల నుంచి ఇసుక అక్రమ తరలిపోతుందన్న సమాచా రంతో సోమవారం అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో నిడదవోలు మండలం పెండ్యాల, జీడిగుంట, పందలపర్రు, కొవ్వూరులో ఎరినమ్మ, దండగుంట,ఔరంగాబాద్‌ ఇసుక ర్యాంపులను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ర్యాంపుల్లో అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. ర్యాంపుల్లో స్థానిక లారీలకు ఇసుక అందిం చడం లేదని, స్థానికేతరులకు ఇసుక అందిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.ఇసుక సరఫరాలో ఆటం కాలు కలిగించవద్దన్నారు.ఆమె వెంట తహశీ ల్దార్లు బి.నాగరాజు నాయక్‌, ఎం.దుర్గాప్రసాద్‌, ఎస్‌ఐ కె.జగన్మోహనరావు ఉన్నారు.

ఇసుక విధానం గందరగోళం చేశారు

జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

రాజమహేంద్రవరం, నవంబరు12(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉచిత ఇసుక అమలు విధానంలో సమస్యలపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్య క్తం చేశారు.అమరావతిలో మంగళవారం ఆయన టీడీపీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో జిల్లాల వారీ సమీక్షించి నపుడు తూర్పుగోదా వరి జిల్లాలో ఇసుక విధానాన్ని ధ్వంసంచేసినట్టు అసంతృప్తి వ్యక్తం చేసి నట్టు సమాచారం. ఉచిత ఇసుక విధానంలో ఇద్దరు ఎమ్మెల్యేల వైఖరి అసలు బాగాలేదు. ఇసుకవిధానాన్ని ధ్వంసం చేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.ఎవరా ఎమ్మెల్యేలు అనేది జిల్లాలో పెద్ద చర్చ నీయాంశమైంది. వాస్తవానికి ఇసుక నాలుగు నియోజకవర్గాల పరిఽధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఎవరనే దానిపై జిల్లాలో చర్చ సాగుతోంది.

Updated Date - Nov 13 , 2024 | 01:09 AM