Share News

ష్‌..గప్‌చుప్‌!

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:23 AM

అఖండగోదావరిలో ఇసుక అక్రమార్కుల మాయాజాలానికి అంతులేకుండా పోయింది. జిల్లాలో సుమారు 25 ఓపెన్‌ ర్యాంపులు, సుమారు 40కు పైగా బోట్స్‌మన్‌ ర్యాంపుల ద్వారా గోదావరిలో రాత్రీపగలూ వందలాది డ్రెడ్జింగ్‌ బోట్లతో ఇసుక తవ్వేస్తున్న సంగతి తెలిసిందే.

ష్‌..గప్‌చుప్‌!

ఒక్కసారిగా ఆగిన తవ్వకాలు

నేడు తనిఖీలకు ఎన్‌జీటీ రాక కారణం

డ్రెడ్జింగ్‌ నిలిపివేయాలని ఆదేశం..

సోమవారం రాత్రే గోదారంతా ఖాళీ

అంతా సవ్యమేనని హైకోర్టుకు ఎస్పీ నివేదిక

ఇసుక అక్రమార్కుల మాయాజాలం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

అఖండగోదావరిలో ఇసుక అక్రమార్కుల మాయాజాలానికి అంతులేకుండా పోయింది. జిల్లాలో సుమారు 25 ఓపెన్‌ ర్యాంపులు, సుమారు 40కు పైగా బోట్స్‌మన్‌ ర్యాంపుల ద్వారా గోదావరిలో రాత్రీపగలూ వందలాది డ్రెడ్జింగ్‌ బోట్లతో ఇసుక తవ్వేస్తున్న సంగతి తెలిసిందే.ఈ డ్రెడ్జింగ్‌ దృశ్యాలు రాజమ హేంద్రవరం, కొవ్వూరు ప్రాంత ప్రజలతో పాటు గోదావరి బ్రిడ్జిలపై రాకపోకలు సాగించేవారందరికీ కళ్లకు కట్టినట్టు కని పిస్తాయి. కానీ అధికారులకు మాత్రం కనిపించడంలేదు. ఇసుక అక్రమాలపై నివేదిక ఇవ్వాలని సంక్రాంతి ముందు హైకోర్టు జిల్లా ఎస్పీ పి.జగదీశ్‌ను ఆదేశించిన సంగతి తెలి సిందే.అయితే ఆయన కొద్దిరోజుల కిందట హైకోర్టుకు సమ ర్పించిన నివేదికలో అక్కడ అంతా సవ్యంగానే జరుగుతుంది, అక్రమంగా డ్రెడ్జింగ్‌ ఏమీ జరగడంలేదని, పలువురి బోట్స్‌ మన్‌ సొసైటీలు, అధికారుల అభిప్రాయాలతో పాటు ,చివరకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి కూడా ప్రస్తుతం ఏమీ జరగనున్నట్టు తెలిపినట్టు నివేదిక ఇవ్వడం గమనార్హం. కానీ ఇవాళ కూడా డ్రెడ్జింగ్‌ ఆగలేదు. ఇదిలా ఉండగా ఇసుక తవ్వకాలను స్వయంగా చూడడానికి ఎన్‌జీటీ(నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌) ప్రతినిధులు మంగళవారం రానున్నారు. ఈ నేప థ్యంలో అధికారులు అప్రమత్తమై సోమవారం రాత్రి నుంచే డ్రెడ్జింగ్‌ నిలిపివేయాలని ఆదేశించారు. మంగళవారం ఎక్కడా డ్రెడ్జింగ్‌ బోట్లుకానీ,యంత్రాలు కానీ కనిపించకూడదని ర్యాం పు నిర్వాహకులకు సూచించారు.దీంతో మంగళవారం నాటికి గోదావరిలో డ్రెడ్జింగ్‌ బోట్లు,ఇతర యంత్రాలు కనిపించ కుం డా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ పరిస్థితిని బట్టే ఇక్కడ ఇసుక అక్రమాలు జరుగుతున్నాయో లేదో అర్ధంచేసుకోవచ్చు. గత మే నెలలో జేపీ సంస్థ కాంట్రాక్టు ముగిసిన సంగతి తెలిసిందే. కానీ రెండు నెలల కిందట వరకూ అదే సంస్థ పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుక లాగేశారు. రాజమహేంద్రవరం వైపు ఆర్‌కే అనే ఒక వ్యక్తి నెలకు పెద్దలకు రూ.12 కోట్లు ఇచ్చే విధంగా ఒప్పందం పెట్టుకుని ర్యాంపు నిర్వాహకులకు టన్ను కు రూ. 150 నుంచి రూ. 200 ఇస్తూ డ్రెడ్జింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై ఆరోపణలు రావడంతో పాటు ఒకరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం కంగారు పడింది.

ఫక్కా ప్లాన్‌ ప్రకారం..

హైకోర్టు ఇక్కడి అక్రమాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించడంతో ఇసుక వ్యాపారులు తప్పించుకోవ డా నికి ఫక్కా ప్లాన్‌ వేశారు. దానికి గతంలో ఇసుక మేటలు డ్రెడ్జింగ్‌ కోసం సుమారు రూ.270 కోట్లతో ఒప్పందం పెట్టు కున్న రాఘవా కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీని రక్షణకవచంగా ఉపయో గించునే ఎత్తుగడ వేసినట్టు సమాచారం. వాస్తవానికి రెండేళ్ల కిందటే ఈ సంస్థ డ్రెడ్జింగ్‌ కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే సదరు కాంట్రాక్టు సంస్థ సుమారు రెండు నెలల కిందట వరకూ డ్రెడ్జింగ్‌ మొదలు పెట్టలేదు. కానీ ఇతరులు అనధికారిగా డ్రెడ్జింగ్‌ నిర్వహించారు.ఇవాళ హైకోర్టు ఆదేశంతో ఇక్కడ డ్రెడ్జింగ్‌ అనధికారికంగా ఏమీ జరగలేదని చెప్పడానికి గతంలో కాంట్రాక్టు పొందిన సంస్థకు వెంటనే రంగంలోకి దింపినట్టు సమాచారం. ప్రస్తుతం డ్రెడ్జింగ్‌ అంతా అదే సంస్థ అధికారికంగా చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్త వ పరిస్థితి చూస్తే వేరేగా ఉంది.

డ్రెడ్జింగ్‌ అంటే ఇదా?

గోదావరిలో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించి, నీటి నిల్వను పెంచేటట్టు చేయాలి. పెద్ద డ్రెడ్జర్‌ను తెచ్చి నది లో దింపి డ్రెడ్జింగ్‌ చేసిన ఇసుకను గొట్టాల ద్వారా గోదావరి ఒడ్డున ఇరిగేషన్‌ స్థలాల్లో పోగు చేయాలి. దానిని అధికారుల అనుమతితో మార్కెట్‌లో విక్రయించి ఆ సొమ్ము ను ప్రభు త్వానికి చెల్లించాల్సి ఉంది. గతంలో తెలుగుదేశం హయాంలో పిచ్చుకలంక పూడ్చడానికి మేటల డ్రెడ్జింగ్‌ ఇసు క ఉప యోగించారు. మేటల నుంచి పిచ్చులంకలోకి గొట్టాలు వేసి నేరుగా ఇసుకను పంపించారు. కానీ భారీ డ్రెడ్జర్లు లేవు. పెద్ద బోట్లకే లారీ ఇంజన్లు బిగించి డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. కేవలం రూ. 500 ఖర్చుతో సుమారు 40 నుంచి క్యూబిక్‌ మీటర్ల ఇసు కను ఒక సారిగానే తోడేస్తున్నారు. దీంతో ఖర్చు తక్కువ. లాభం ఎక్కువ.అందుకే అక్రమార్కులు ఈ మార్గం ఎంచుకు న్నారు. పైగా ఇటీవల ప్రతిమా అనే సంస్థకు ఇసుక తీతను ప్రభుత్వం కాంట్రాక్టుకు ఇచ్చింది.ఆ సంస్థ లేబుల్‌తోనే బిల్లులు ఇస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రతిమా సంస్థ డ్రెడ్జింగ్‌ చేస్తుం దా? రాఘవా కంపెనీ చేస్తుందా అనేది ఇక్కడ ఎవరికీ అర్ధం కాని విషయం.కానీ డ్రెడ్జింగ్‌ మాత్రం జరిగిపోతుంది.

అంతా సవ్యంగానే ఉందని ఎస్పీ నివేదిక

ఇసుక అక్రమాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించ డంతో ఎస్పీ పి.జగదీష్‌ ఇటీవల హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. కానీ అందులో ఎక్కడా యంత్రాలతో పనిచేయడంలేదని, మాన్యువల్‌గా చేస్తున్నట్టు చెప్పడం గమనార్హం. రాఘవ కన స్ట్రక్షన్‌ కంపెనీ మాత్రమే ఒప్పందం ప్రకారం డ్రెడ్జింగ్‌ చేస్తు న్నట్టు అధికారుల వివరణతో ఆయన నివేదిక ఇవ్వడం గమ నార్హం. పైగా హైకోర్టుకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఇక్కడ అక్రమంగా డ్రెడ్జింగ్‌ జరగలేదని చెప్పినట్టు ఈ నివేదికలో ఉండడం గమనార్హం.వాస్తవానికి కచ్చులూరు బోట్‌ ప్రమాదం తర్వాత ఇక్కడ ఇసుక బోట్లకు లైసెన్సులు ఇవ్వలేదు.కానీ ఇక్కడ సాధారణ బోట్లతో పాటు డ్రెడ్జింగ్‌ బోట్లు కూడా తిరు గుతున్నాయి. వీటికి ఎవరు అనుమతిచ్చారు. ఇప్పటి వరకూ ఎంత ఇసుక తవ్వారు.గతంలో అక్రమాలు జరిగి ఉంటే ఎంత మేర జరిగి ఉంటాయనే దాని జోలికి ఎవరూ వెళ్లలేదు.

మరి భయమెందుకు

ఇక్కడ అక్రమాలు లేకపోతే, ఎన్జీటీ బృందం వస్తుందని తెలియగానే తేలికుట్టిన దొంగలా వ్యవహరించడం దేనికి? మంగళవారం డ్రెడ్జింగ్‌ మిషన్లు,యంత్రాలను దాచేయమని ర్యాంపుల నిర్వాహకులకు ఆదేశాలివ్వడంలేదనికి..?దీనిని బట్టే ఇక్కడ ఎంత అక్రమాలు జరుగుతున్నాయో అర్ధమ వుతోంది.

Updated Date - Feb 20 , 2024 | 12:23 AM