గోదాట్లో..డ్రెడ్జింగా
ABN , Publish Date - Aug 28 , 2024 | 12:31 AM
అధికారులు చెబుతున్నది ఒకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి..గోదావరిలో ఇసుక తవ్వ కాలకు ఇంకా పర్యావరణ అనుమతులే రాలేదు.. అయితే మంగళవారం గోదావరిలో డ్రెడ్జింగ్ బోట్లు తిరగడం చర్చనీయాంశమైంది.
ఆ బోట్లు ఎందుకొచ్చాయ్..
గామన్ బ్రిడ్జి సమీపంలో ట్రయల్స్
అటూ ఇటూ తిరగడంతో అనుమానాలు
ర్యాంపుల్లో బాటలు.. జేసీబీలు రెడీ
ఇంకనూ పర్యావరణ అనుమతుల్లేవ్
జిల్లాలో తీవ్రంగా ఇసుక కొరత
నిలిచిపోయిన భవన నిర్మాణాలు
ఇసుక సరఫరాపై అధికారుల దృష్టి
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
అధికారులు చెబుతున్నది ఒకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి..గోదావరిలో ఇసుక తవ్వ కాలకు ఇంకా పర్యావరణ అనుమతులే రాలేదు.. అయితే మంగళవారం గోదావరిలో డ్రెడ్జింగ్ బోట్లు తిరగడం చర్చనీయాంశమైంది. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయ్.. అనుమతుల్లేకుండా ఎలా తిరుగుతు న్నాయ్.. ఎందుకు తిరుగుతున్నాయ్.. అనే అను మానాలు తలెత్తాయి.ఒక పక్క అధికారులు ఉచిత ఇసుక సరఫరాపై మల్లగుల్లాలు పడుతుంటే ఇం కో పక్క డ్రెడ్జింగ్ బోట్లు తిరగడం పలు విమ ర్శలకు తావిచ్చింది. గోదావరి వరదల నేపథ్యంలో ప్రస్తుతం ఇసుక సరఫరా నిలిపివేశారు. దీంతో జిల్లాలో ఇసుక కొరత విపరీతంగా ఉంది. ఐదు యూనిట్ల ఇసుక రూ. 23 వేల వరకు ధర పలుకుతుందంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరు వాత ఉచిత ఇసుక అంటూ అందుబాటులోకి తేవడంతో భవన నిర్మాణదారులంతా ఆనందప డ్డారు. అంతలోనే వరదలు రావడంతో ఇసుక కొరత వచ్చి ఆందోళన చెందుతున్నారు.ఈ నెల 10వ తేదీకి ముందే ఇంటి నిర్మాణాలకు ముహూ ర్తాలు పెట్టుకుని ఇసుక లేక చాలా మంది నిర్మా ణాలు ఆపేసి కూర్చుకున్నారు. జిల్లాలో ఇసుక ర్యాంపులకు ఎపుడు అనుమతి ఇస్తారో .. ఇసుక ఎప్పుడు వస్తుందోనని భవన నిర్మాణదా రులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
డ్రెడ్జింగ్ బోట్లు ఎలా వచ్చాయ్..
గామన్ బ్రిడ్జి సమీపంలోని కాతేరు ర్యాంపుల్లో డ్రెడ్జర్లు బోట్లు మంగళవారం ట్రయల్స్ వేయడం చర్చనీయాంశమైంది. పైగా కాతేరు నుంచి వెం కటనగర్ వరకూ అన్ని ర్యాంపుల్లో డ్రెడ్జింగ్ బోట్లు ప్రత్యక్షమయ్యాయి.మరో ప్రక్క ర్యాంపుల బాట లను జేసీబీలతో శుభ్రం చేస్తున్నారు. ఈ ర్యాంపు లకు కొంత దూరంలోని హైవే ప్రక్కన వ్యవ సాయ కళాశాల సమీపంలో గతంలో ఇసుక స్టాక్ పాయింట్ ఉండే ప్రాంతాన్ని చదును చేశారు. డ్రెడ్జింగ్ బోట్లు బ్రిడ్జి కింద నుంచి అటూ ఇటూ నడుపుతూ హడావిడి చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇస్తారే మోననే ప్రచారం జరుగుతోంది.మరో పక్క జిల్లా లోని ర్యాంపులు మూతపడి ఉన్నాయి. ఓపెన్ ర్యాం పులు ప్రారంభమయ్యే వరకూ ఇసుక కొరత లేకుండా అఖండ గోదావరిలో డీసిల్టేషన్ పేరిట ఇసుక తీయడానికి 9 ర్యాంపులు గుర్తించారు. వాటికి కొన్ని అనుమతులు రావలసి ఉంది. ఇరి గేషన్ ఆధ్వర్యంలో ర్యాంపుల్లో బోట్స్‌మన్ సొసై టీల ద్వారా ఇసుక తీయడానికి టెండర్లు పిలవా లని భావించారు.ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు రాలేదు.దీంతో ఆలస్యం అవు తోంది. ఇదిలా ఉండగా ఇక టెండర్లు పిలవ కుండానే బోట్స్‌మన్ సొసైటీల ద్వారా ఇసుక తీసే ఆలోచన కూడా అధికారులు చేస్తున్నట్టు సమాచా రం. ఇది వాస్తవ రూపం దాల్చకపోతే వచ్చే నెల 11వ తేదీ వరకూ ఇసుక లేనట్టే. కానీ ఈలోపు ఇసుక సమస్యను పరిష్కరించాలనే ఆలోచనతో అధికారులు ఉన్నారు. గామన్ బ్రిడ్జికి అవతల వైపు కాతేరు నుంచి సీతానగరం వైపు మైన్స్ అధికారుల ఆధ్వర్యంలో అనుమతులు రానున్నా యి. ప్రస్తుతం ఏవిధమైన అనుమతులు లేవని అధికారులు చెబుతుంటే..కాతేరు ర్యాంపుల్లో డ్రెడ్జిం గ్ పడవల సందడి అనుమానాలు తావిస్తోంది.
ఇసుక రవాణా వాహనాలకు జేసీ అనుమతి తప్పనిసరి : కలెక్టర్
ఉచిత ఇసుక కోసం రీచ్‌లకు వచ్చే వాహనాలకు స్లాట్ కేటాయింపు చేసి ట్రక్కు షీట్ జారీ చేయ వలసి ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు.కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె జేసీ చినరాముడు, డీఆర్వో జి.నరసింహులుతో కలసి డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షిం చారు. ఇసుక రవాణా వాహనాలకు జేసీ అనుమతి తీసుకోవాలని, ఆయన జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మాత్రమే బుకింగ్ పాయింట్ వద్దకు అనుమతించి ట్రక్ షీట్ జారీ చేయాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు. ఇక పెండింగ్‌లో ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీలు 492లో 490 పరిశీలించినట్టు చెప్పారు. హౌసింగ్ ప్రాజెక్టు పీడీ వద్ద ఒకటి, బిక్కవోలు మండల సర్వేయర్ వద్ద ఒకటి పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు.
పోలీస్ స్టేషన్లలో అక్రమ ఇసుక ఏం చేస్తారు?
పెరవలి, ఆగస్టు 27 : ఇసుక ఎక్కడున్నా బంగారమాయే.. ప్రస్తుతం గోదావరికి వరదలు వస్తున్నందు వల్ల ఇసుక తీయడం కుదరదు. అందువల్ల ఎక్కడ గుట్టలు ఉన్నా దానికి అమిత డిమాండ్ ఉంటుంది. ఇటీ వల ప్రభుత్వం స్టాక్ పాయింట్ల నుంచి ఇస్తున్న ఇసుకను ఆగమేఘాలపై తీసుకుపోయారు. డిమా ండ్‌కు తగ్గ సరఫరా కూడా చేయలేక రెండు రోజులు వేచి ఉంటేనే గాని ఒక్క లారీ కూడా ఎగుమతి కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ అక్రమ నిల్వలు ఉన్నా వాటిని వెలికి తీయాల్సి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. పెరవలి పోలీసు స్టేషన్ పరిధిలో గత ఐదారేళ్లలో అక్రమ ంగా పట్టుకున్న ఇసుకను ఇరిగేషన్ స్థలంలో నిల్వ ఉంచారు. అయితే అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ ఇసుక గుట్ట నిండా పిచ్చి మొక్కలు మొలిచిపోయాయి.అక్కడ ఇసుక ఎంత ఉందో కూడా తెలియని పిరిస్థతి. అక్రమంగా తీసుకువెళుతున్న ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేసి అదే ఆవరణలో ఉంచగా అది కూడా తుప్పు పట్టి ఇసుకలో కలిసిపోయింది.ఈ పరిస్థితుల్లో ఆ ఇసుకను వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ దిశగా పోలీస్ రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రస్తుతం ఇసుక కొరతగా ఉండడం వల్ల దానిని వేలం వేయాలని కోరుతున్నారు.దీనిపై ఎస్‌ఐ అప్పారావును ప్రశ్నించగా ఇసుక విషయ మై ఉన్నతాధికారులకు నివేదించా..త్వరలోనే వేలం వేయడానికి రంగం చేస్తారని పేర్కొన్నారు.