Share News

తవ్వుకో..దోచుకో..

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:36 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న ఉచిత ఇసుక పథకం లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ఇప్పటికే ఆత్రేయపురం మండలంలో అంకంపాలెం, నార్కెడిమిల్లి, పులిదిండి వద్దిపర్రు, ఆత్రేయపురం ఇసుక ర్యాంపులను ప్రారంభించడమే కాకుండా మరో మూడు ర్యాంపులను అధికారులు మంజూరు చేయనున్నారు.

తవ్వుకో..దోచుకో..

యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు

ఫిర్యాదు చేసినా చోద్యం చూస్తున్న అధికారులు

ట్రాక్టర్‌ ఇసుక రూ.1500కు విక్రయం

ఆత్రేయపురం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న ఉచిత ఇసుక పథకం లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ఇప్పటికే ఆత్రేయపురం మండలంలో అంకంపాలెం, నార్కెడిమిల్లి, పులిదిండి వద్దిపర్రు, ఆత్రేయపురం ఇసుక ర్యాంపులను ప్రారంభించడమే కాకుండా మరో మూడు ర్యాంపులను అధికారులు మంజూరు చేయనున్నారు. ఈ ర్యాంపుల ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణదారులకు ఉచితంగా ఇసుక అందించాల్సి ఉంది. ఈ ర్యాంపులలో సీరియల్‌ ప్రకారం కాంట్రాక్టర్లు వ్యవహరించకుండా సొంత వాహనాల ద్వారా ఇసుక తరలించుకుని అధిక రేటుకు అమ్ముతూ సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు సైతం ప్రజలు జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ దృష్టికి తీసుకువచ్చారు. మరో పక్క ఇసుకాసురులు అనధికార ర్యాంపుల్లోకి చొరబడి ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. కొద్దిరోజుల క్రితం కట్టుంగ ఇసుక ర్యాంపులో అక్రమార్కులు వందలాది ట్రాక్టర్ల ఇసుకను అమ్మేసుకున్నారు. మరో పక్క వెలిచేరులో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. సుమారు 15 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కొల్లగొట్టారు. గోదావరి నదీ గర్భంలోకి బాటలు వేసి ట్రాక్టర్‌ గ్రామంలో అన్‌లోడింగ్‌ చేస్తే రూ.1000, పక్క గ్రామానికి తీసుకెళితే రూ.1500 ఽధరను నిర్ణయించి అమ్మకాలు సాగించి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఇసుక నిల్వలు చేసుకుని లారీల ద్వారా అమ్మేందుకు గుట్టలు పెట్టారు. ఇంత దందా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Dec 23 , 2024 | 12:36 AM