సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jan 05 , 2024 | 01:23 AM
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సామర్లకోట, జనవరి 4: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచు కుని దక్షిణ మద్య రైల్వే విజయవాడ సెక్షన్ పరిధిలో సామర్లకోట మీదుగా ఎనిమిది సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి కార్యాలయం నుంచి గురువారం రాత్రి సమాచారం అందింది. ఈ మేరకు సామర్లకోట రైల్వే ఉన్నతాధికారి నుంచి ఆంధ్రజ్యోతి సమాచారాన్ని సేకరించింది. 07027 నంబరు గల హైద్రాబాద్- బెరహమ్‌పూర్ మధ్య రాకపోకలు సాగించేందుకు సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 13 తేదీ శనివారం ఒక ట్రిప్ బయలుదేరనుంది. ఈ రైలు శనివారం హైద్రాబాద్‌లో రాత్రి 10.40 నిమిషాలకు బయలుదేరి శనివారం సాయంత్రం 3.15 గంటలకు బెరహమ్‌పూర్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, కొండపల్లి, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి మీదుగా సామర్లకోటకు ఉదయం 8.13కి చేరుకుని అన్నవరం 8.45కి చేరుకుని అనకాపల్లి మీదుగా బెరహమ్‌పూర్‌కు ఆదివారం సాయంత్రం 3.15కి వెళుతుంది. 07028 నంబరు గల బెరహమ్‌పూర్-హైద్రాబాద్ మధ్య సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం జనవరి 14 తేదీ సాయంత్రం 6.00కి బయలుదేరి దువ్వాడకు రాత్రి 11.30కి చేరుకుంటుంది. అన్నవరానికి అర్ధరాత్రి 12.43కి చేరుకుంటుందని, సామర్లకోటకు రాత్రి 1.23కి చేరుకుంటుందన్నారు. రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, జనగాం, సికింద్రాబాద్ మీదుగా హైద్రాబాద్‌కు సోమవారం ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. 07022 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ-సికింద్రాబాద్ మధ్య జనవరి 12న శుక్రవారం సాయంత్రం 5.40కి బయలుదేరనుంది. ఈ రైలు సామర్లకోటకు రాత్రి 6.10కి చేరుకుంటుంది. అనపర్తికి 6.30కి చేరుకుని రాజమండ్రికి రాత్రి 6.50కి చేరుకుంటుంది. నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, కొండపల్లి, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు శనివారం తెల్లవారుజామున 5.55కి చేరుకుంటుంది.
07221 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్-కాకినాడ మధ్య జనవరి 11న గురువారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనుంది. ఈ రైలు ఖాజీపేట, వరంగల్, ఖమ్మం, కొండపల్లి, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు మీదుగా రాజమండ్రికి శుక్రవారం ఉదయం 6.10కి చేరుకుని, అనపర్తికి 6.30కి, సామర్లకోటకు 6.50కి, కాకినాడకు 8 గంటలకు చేరుకుంటుంది. 07025 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్-బెరహమ్‌పూర్ మధ్య జనవరి 12,19 తేదీలలో ప్రతీ శుక్రవారాలలో బయలుదేరనున్నాయి. ఈ రైలు శుక్రవారం రాత్రి 7.45కి సికింద్రాబాద్‌లో బయలుదేరి పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా రాజమండ్రికి శనివారం తెల్లవారుజామున 3.08కి చేరుకుని, సామర్లకోటకు 3.45కి చేరుకుంటుంది. అన్నవరం, అనకాపల్లి, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం మీదుగా బెరహమ్‌పూర్‌కు శనివారం ఉదయం 11.15కి చేరుకుంటుంది. 07026 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు బెరహమ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య జనవరి 13,20 తేదీలలో ప్రతీ శనివారాలలో మధ్యాహ్నం 12.30కి బయలుదేరనున్నాయి. ఈ రైలు బెరహమ్‌పూర్‌లో మధ్యాహ్నం 12.30కి బయలుదేరి ఇచ్చాపురం, శ్రీకాకుళం, విజయనగరం, పెందుర్తి, అనకాపల్లి మీదుగా అన్నవరానికి సాయంత్రం 6.23కి చేరుకుని సామర్లకోటకు రాత్రి 7.08కి చేరుకుంటుంది. రాజమండ్రికి రాత్రి 7.55కి చేరుకుని తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు ఆదివారం ఉదయం 6.30కి చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు, రైలు రిజర్వేషన్ టిక్కెట్లకు సమీప రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయాల వద్ద సంప్రదించాలని రైల్వే ఉన్నతాధికారి అందించిన సమాచారంలో తెలిపారు.