19న ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ పర్యటన
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:38 AM
రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణ అంశాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు ఏకసభ్య కమిషన్ నియమించినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారిణి పి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు.
అమలాపురం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణ అంశాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు ఏకసభ్య కమిషన్ నియమించినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారిణి పి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్‌మిశ్రాను కమిషన్ సభ్యునిగా ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ నెల 19న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కాకినాడలో పర్యటిస్తారన్నారు. అంతేకాకుండా జిల్లా యంత్రాంగంతో, వివిధ ఉపకులాల సభ్యులు, సంఘాలతో సమావేశమై వినతిపత్రాలు స్వీకరిస్తారు. జిల్లాకు సంబంధించిన వ్యక్తులు, కులసంఘాలు తమ వినతులను ఈ నెల 19న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో అందజేయాలి.