పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్లు
ABN , Publish Date - Oct 11 , 2024 | 01:25 AM
విద్యార్థి దశ నుంచి క్రీడల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పిఠాపురం నియోజకవర్గాల్లోని పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్లు అందజేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీసుకున్న చొరవతో త్వరలో పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు అందనున్నాయి. పాఠశాలల్లో విద్యాబోధనతోపాటు క్రీడలకు ఉన్న సౌకర్యాలపై ఇటీవల పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. ఇందులో భాగం గా నియోజకవర్గంలోని 32 ఉన్నత, ప్రాఽథమికోన్నత పాఠశాలలు, ప్రాఽథమిక పాఠశాలలుకు క్రీడాసామగ్రి కిట్లు సమకూర్చాలని నిర్ణ యించారు.
పిఠాపురం, అక్టోబరు 10: విద్యార్థి దశ నుంచి క్రీడల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పిఠాపురం నియోజకవర్గాల్లోని పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్లు అందజేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీసుకున్న చొరవతో త్వరలో పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు అందనున్నాయి. పాఠశాలల్లో విద్యాబోధనతోపాటు క్రీడలకు ఉన్న సౌకర్యాలపై ఇటీవల పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. ఇందులో భాగం గా నియోజకవర్గంలోని 32 ఉన్నత, ప్రాఽథమికోన్నత పాఠశాలలు, ప్రాఽథమిక పాఠశాలలుకు క్రీడాసామగ్రి కిట్లు సమకూర్చాలని నిర్ణ యించారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి పాఠశాలకు రెండు స్పోర్ట్స్ కిట్లు అందించనున్నారు. ఒక్కొక్క కిట్‌కు రూ.25వేలు వ్యయం అవుతుందని అంచనా. ఇందు నిమిత్తం రూ.16 లక్షలు అవసరమవుతాయని గుర్తించారు. ఈ నిధులను సీఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి సమకూరుస్తామని జిల్లా కలెక్టరు షాన్‌మోహన్ డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. పాఠశాలల కు అందించే కిట్లను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో గురు వారం పవన్‌కల్యాణ్ పరిశీలించారు. ప్రతి కిట్‌లో ఉండే క్రీడల సామగ్రి, నాణ్యతను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.