Share News

మా బడికి రండి నాన్నా..

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:37 AM

మా బడికి రండి అమ్మానాన్నా.. అంటూ పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపా ధ్యాయుల మెగా సమావేశాన్ని ఉత్సవ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 మా బడికి రండి నాన్నా..

శంఖవరం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మా బడికి రండి అమ్మానాన్నా.. అంటూ పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపా ధ్యాయుల మెగా సమావేశాన్ని ఉత్సవ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాఠశాలలో ఈ సమావేశాలు నిర్వ హించి పాఠశాలలో లోటుపాట్లు ఉపాధ్యాయు లు, చదువు, పిల్లల్లో బలహీనతలు తల్లిదండ్రు లు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 7న నిర్వహించే ఈ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని సూచిస్తోంది.

తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు

పాఠశాలలో సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకు ముగ్గులు పోటీలు, టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అం దిస్తారు. పూర్వపు విద్యార్థులను పిలిచి వారి విజయగాధలను విద్యార్థులకు వివరిస్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్న భోజనంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు అందిస్తారు. ఇం దులో చదువు, ఆటలు, మార్కులు, పాఠశాలలో వ్యవహరించే తీరు వంటి అంశాలు పొందిపరిచి ఉంటాయి. సోషల్‌ మీడియాలో పిల్లలు ఎలా ఉంటున్నారో గమనించడంతోపాటు తగిన జాగ్ర త్తలపై తల్లిదండ్రులకు వివరిస్తారు.

తల్లిదండ్రులను దగ్గర చేయడానికే..

ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను వారి తల్లిదండ్రులను దగ్గర చేసేందుకు ఈ కార్య క్రమం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులు ఏఏ అంశాల్లో చురుగ్గా ఉంటున్నారో ఉపాధ్యాయులకు వివరించడం ఆయా ఆంశాల్లో మరింత శిక్షణ ఇప్పించడం, క్రీడలు, సైన్స్‌ వంటి వాటిలో విద్యార్థుల ఆసక్తిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పంచుకోవడం ద్వారా వాటిని మరింతగా అభివృద్ధి చేసే అవ కాశం ఉంటుంది. విద్యార్థులే స్వయంగా తమ సృజనాత్మకతను ఉపయోగించి ఆహ్వాన పత్రికలు తయారుచేసి తల్లిదండ్రులను ఆహ్వానించేలా కార్యక్రమాలు చేసేలా విద్యాశాఖాధికా రులు ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.

Updated Date - Dec 06 , 2024 | 01:37 AM