Share News

రేపు బడి పండుగ

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:38 AM

జిల్లాలోని ప్రభుత్వ బడులన్నీ చరిత్రలోనే తొలిసారిగా ఓ వేడుకకు చేసుకోబోతున్నాయి. పిల్లలు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో శనివా రం పండుగ నిర్వహించనున్నారు.

రేపు బడి పండుగ
పేరెంట్స్‌కు ఆహ్వానపత్రిక అందజేస్తున్న టీచర్లు

జిల్లాలో 988 పాఠశాలలు

1,03,422 మంది విద్యార్థులు

పాఠశాలల అభివృద్ధిపై చర్చ

3 లక్షల మంది వస్తారని అంచనా

ఉదయం ఆరంభం

మధ్యాహ్నం వరకూ నిర్వహణ

రూ.23 లక్షలు విడుదల

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ప్రభుత్వ బడులన్నీ చరిత్రలోనే తొలిసారిగా ఓ వేడుకకు చేసుకోబోతున్నాయి. పిల్లలు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో శనివా రం పండుగ నిర్వహించనున్నారు. అదే రాజకీ యాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌’. పిల్లల బంగారు భవితకు ఒక్క అడుగు ముందుకు అనే నినాదంతో భారీ కార్యక్రమానికి పాఠశాలలను సిద్ధం చేశారు. ఇప్పటి వరకూ స్కూల్లో పరిస్థితి తల్లిదండ్రులకు, పిల్లల చదువు పట్ల వారి మన సులో భావాలు ఉపాధ్యాయులకు పూర్తిగా తెలి సేవి కావు.ముందు ఈ ఖాళీని పూరిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చనే సత్సంకల్పంతో నిర్వ హిస్తుండడంతో ఈ వేడుకకు ప్రాధాన్యం ఏర్పడిం ది.ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానో పాధ్యా యులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులు/సంరక్షకులకు పండుగకు రావా లంటూ ఆహ్వాన పత్రికలు అందజేశారు. జిల్లా లోని 714 ప్రాథమిక, 72 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో బాలురు 49348, బాలికలు 54074 మంది..వారి తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు,ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తది తరులు సుమారు 3 లక్షల వరకూ ఈ వేడుకల్లో పాల్గొనే ఆవకాశం ఉంది. ఏర్పాట్లకు ఇప్పటికే జిల్లాకు రూ.23లక్షల నిధులను ప్రభుత్వం విడు దల చేసింది. కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్‌ పి.ప్రశాంతి సమీక్షించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

నాడు అలా - నేడు ఇలా

గత వైసీపీ ప్రభుత్వంలో అటు ఉపాధ్యాయు లకు బోధనకు సమయం లేకపోగా.. ఇటు విద్యార్థుల చదువు అటకెక్కింది. సీబీఎస్‌సీ, ఐబీ అంటూ రోజుకో సిలబస్‌, ట్యాబ్‌లు, ఫ్లాట్‌ ప్యానెళ్లు ఇలా ప్రచార ఆర్భాటానికి విద్యావ్య వస్థను అవస్థల్లోకి నెట్టేశారు. పిల్లల్లో అభ్యసనా సామర్థ్యం అడుగంటే దుస్థితికి చేరుకొంది. పది ప్లస్‌ మైనస్సయ్యింది. బోధన కోసం సమయం లేకుండా బోధనేతర పనులు ఎక్కువ కావడంతో ఉపాధ్యాయులు ఆవేదన అంతా ఇంతా కాదు. జీతాల కోసం రోడ్డెక్కిన గడ్డు రోజులను అనుభ వించారు.కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వా త రేపటి పౌరుల బంగారు భవిత కోసం అభూత కల్పనల కంటే అక్షరం ముఖ్యమని విద్యారంగాన్ని గాడిలో పెట్టే పని మొదలు పెట్టిం ది.విద్యా మంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే నారా లోకేశ్‌ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

పారదర్శకతే ప్రామాణికతగా

విద్యార్థి ఉదయం బడికి వచ్చి సాయంత్రం ఇంటికి చేరుకొంటే ఆ రోజుకు చదువు గడిచిపో యినట్టు కాదు. ప్రతి విద్యార్థిని సానబట్టి తీర్చి దిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. దానికి తగిన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిం చాలి. అలాగే పిల్లల మంచి నడవడిక, క్రమ శిక్షణకు తొలి అడుగు ఇంటి నుంచే వేయాలి. ఈ మూడింటికీ సమన్వయం కుదిరితే పిల్లలు సునాయాసంగా ఉన్నత స్థాయికి చేరుకోడానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకూ పాఠశాలకు తల్లిదండ్రులు వచ్చి పిల్లాడి గురించి ఆరా తీసిన సందర్భాలు ఒకటీఅరా ఉండేవి. అలాగే పాఠశాలల్లోని స్థితిగతులపై వారికి అవ గాహన ఉండేది కాదు. వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం ఫుల్‌స్టాప్‌ పెట్టనుంది. విద్యార్థి, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు/సంరక్షకులు కూర్చుని విద్యార్థి భవిష్యత్తు, బడి అభివృద్ధే లక్ష్యంగా స్నేహపూర్వకంగా చర్చిస్తారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంటా ఉల్లా సంగా,ఉత్సాహంగా జరపాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి.ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9-9.30 గంటల వరకూ తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు,దాతలు,ప్రముఖులు, ఎస్‌ఎంసీ సభ్యులు, వార్డు పెద్దలు, అధికారులకు పిల్లలు, ఉపాధ్యాయులు స్వాగతం పలుకుతారు. 9.30-11 గంటల వరకూ విద్యార్థుల ప్రో గ్రెస్‌ కార్డులు అందజేయడంతో పాటు పిల్లల నడవడిక, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చిస్తారు. తల్లిదం డ్రుల సూచనలను స్వీకరిస్తారు. 11-11.20 గం టల వరకూ ఆసక్తి ఉన్న మహిళలకు తరగతి వారీగా రంగోళీ, పురుషులకు టగ్‌ ఆఫ్‌ వార్‌ నిర్వహిస్తారు.తర్వాత35 నిమిషాలపాటు పాఠశా ల మైదానంలో సమావేశం, తక్కువ నిడివి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రధానో పాధ్యాయులు స్కూల్‌ ప్రోగ్రెస్‌పై వివరణ ఇస్తా రు. అనంతరం సైబర్‌ క్రైంపై అవగాహన, మహ నీయుల స్ఫూర్తి గాథలు, ఆహుతుల నుంచి అభిప్రాయాల సేకరణ, ప్రతిజ్ఞ ఉంటుంది. 12.35 గంటలకు అందరూ కలిసి భోజనం చేసిన తర్వా త కార్యక్రమాన్ని ముగిస్తారు.

అద్భుతమైన కార్యక్రమం

ఇదొక అద్భుతమైన కార్యక్ర మం. 988 పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లూ చేశాం. పిల్లల బంగారు భవితకు, పాఠశాల అభివృద్ధికి స్నేహపూర్వక వాతావరణంలో చర్చ జరుగు తుంది.శుక్రవారం సన్నద్ధ కార్యక్రమాలు చేయాలని చెప్పాం. మెగా పెరేంట్‌ టీచర్‌ మీట్‌ రోజున తల్లిదండ్రులకు భోజన ఏర్పాట్లు చేశాం. పాఠశాలతో పాటు ప్రతి విద్యార్థి ప్రస్తుత స్థితిని తల్లిదండ్రులకు వివరించడమే కాకుండా వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందజేశాం.

- కె.వాసుదేవరావు,డీఈవో

Updated Date - Dec 06 , 2024 | 12:38 AM