స్టెల్లాఎల్ నౌకకు అన్నీ అవాంతరాలే!
ABN , Publish Date - Dec 25 , 2024 | 01:24 AM
కాకినాడ సముద్రంలో లంగరు వేసు కుని ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌకకు అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. వాతావర ణం అనుకూలించకపోవడం వల్ల నౌకలోని రేషన్ బియ్యం ఒడ్డుకు చేర్చలేకపోతున్నారు. దీంతో నౌక గమ్యం చేరే పరిస్థితి చేరడం లేదు. మంగళవారం కూడా తుఫాను ప్రభా వంతో బియ్యాన్ని తీసుకురాలేకపోయారు. స్టెల్లాఎల్ పనామా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చి దాదాపు నెల రోజులవుతోంది.
కలెక్టరేట్(కాకినాడ), డిసెంబరు 24(ఆంధ్ర జ్యోతి): కాకినాడ సముద్రంలో లంగరు వేసు కుని ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌకకు అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. వాతావర ణం అనుకూలించకపోవడం వల్ల నౌకలోని రేషన్ బియ్యం ఒడ్డుకు చేర్చలేకపోతున్నారు. దీంతో నౌక గమ్యం చేరే పరిస్థితి చేరడం లేదు. మంగళవారం కూడా తుఫాను ప్రభా వంతో బియ్యాన్ని తీసుకురాలేకపోయారు. స్టెల్లాఎల్ పనామా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చి దాదాపు నెల రోజులవుతోంది. దీనిలో రేషన్ బియ్యం ఉన్నాయనే సమా చారంతో ఈనెల 4వ తేదీన అధికారుల బృం దం తనిఖీలు చేసి గుర్తించింది. దీనిలో 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని ఈనెల 17వ తేదీన జిల్లా కలెక్టర్ ప్రకటించా రు. దీంతో ఈ బియ్యాన్ని భారీ నౌక నుంచి బార్జీల ద్వారా తీసుకురావడానికి అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తుఫాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం ఒడ్డుకు తరలించ డం అసాధ్యంగా మారింది. పైగా ఈనెల 26వ తేదీ నుంచి మరో తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారు లు ప్రకటించారు. దీంతో ఈ ప్రక్రియ మరిం తగా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ భారీ నౌకలో నుంచి బియ్యం అన్ లోడింగ్ అయిన తర్వాత మరో 12వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేయాలి. తర్వాతే ఈ నౌక కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికాలో కోటోనౌ పోర్టుకు వెళుతుం ది. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి పశ్చి మ ఆఫ్రికాకు 26 రోజుల ప్రయాణ సమయం పడుతుంది. ఈ నౌక లోడింగ్ చేసుకుని వచ్చే జనవరి నెలాఖరుకు కోటోనౌ పోర్టుకు చేరు కుంటుందని నౌక అధికారులు భావిస్తున్నారు.