సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌కు నేడు శంకుస్థాపన
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:04 AM
జేఎన్టీయూకే, జనవరి 27: వర్శిటీ మైదానంలో ఖేలో ఇండియా పథకలో భాగంగా మంజూరైన 400మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి ఆదివారం కాకినాడ ఎంపీ వంగాగీత శంకుస్థాపన చేయనున్నారని ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్‌ప్రసాదరాజు తెలిపారు. ఈట్రాక్ నిర్మాణానికి మొత్తం రూ.13.55 కోట్ల నిధులు అవస
జేఎన్టీయూకే, జనవరి 27: వర్శిటీ మైదానంలో ఖేలో ఇండియా పథకలో భాగంగా మంజూరైన 400మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి ఆదివారం కాకినాడ ఎంపీ వంగాగీత శంకుస్థాపన చేయనున్నారని ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్‌ప్రసాదరాజు తెలిపారు. ఈట్రాక్ నిర్మాణానికి మొత్తం రూ.13.55 కోట్ల నిధులు అవసరం కాగా కేంద్రప్రభుత్వం రూ.9.50 కోట్లు మంజూరుచేయగా దానికి మ్యాచింగ్ గ్రాంట్‌గా యూనివర్శిటీ నుంచి రూ.4.05 కోట్ల నిధులు విడుదల జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు.