Share News

స్మార్ట్‌మీటర్లు వచ్చేశాయి

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:09 AM

విద్యుత్‌ శాఖ ఆధునీకరణవైపు వడివడిగా పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా వీటిని తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా ఎట్టకేలకు విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లను రంగంలోకి దించారు.

స్మార్ట్‌మీటర్లు వచ్చేశాయి

ఆలమూరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖ ఆధునీకరణవైపు వడివడిగా పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా వీటిని తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా ఎట్టకేలకు విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లను రంగంలోకి దించారు. వీటిని మొదటి దశలో వ్యాపార సంస్థలు, షాపు లు, దేవాలయాలకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి గత మీటర్ల మాదిరిగా పనిచేస్తాయి. నెలవారీగా బిల్లులను చెల్లించాల్సి ఉం టుంది. నెల పూర్తి కాగానే మీటర్‌ రీడింగ్‌ తీయకుండానే ఆ నెలలో వాడిన విద్యుత్‌ బిల్లు మీటరుకు లింక్‌ చేసుకున్న సెల్‌ నెంబరుకు మెసేజ్‌ వస్తుంది. దాని ఆధారంగా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటి కంట్రోల్‌ మాత్రం విద్యుత్‌శాఖ ఆధీనంలో ఉంటుంది కాబట్టి బిల్లు చెల్లించకపోతే తక్షణం కరెంట్‌ సరఫరా నిలుపుదల చేస్తారు. ఇది విజయవంతం అయితే సెల్‌ఫోన్‌ మాదిరిగా ముందునే రీచార్జ్‌ చేయించుకోవాలసి వస్తుంది. అంటే....మనం చేసుకున్న రీచార్జ్‌ను బట్టి విద్యుత్‌ వాడకం చేసుకునే అవకాశం ఉంటుంది. తదుపరి గృహాలకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆలమూరు మండలంలో వ్యాపార సంస్థలు, దుకాణాలు, దేవాలయాలకు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 26 , 2024 | 12:09 AM