Share News

సోలార్‌తో కాలుష్య రహిత విద్యుత్‌

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:12 AM

సోలార్‌ విద్యుత్‌ను నూరుశాతం వినియోగించు కుని లబ్ధిపొందాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు.

సోలార్‌తో కాలుష్య రహిత విద్యుత్‌

మండపేట, డిసెంబరు, 24(ఆంధ్రజ్యోతి): సోలార్‌ విద్యుత్‌ను నూరుశాతం వినియోగించు కుని లబ్ధిపొందాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. మంగళవారం సత్య భాస్క ర జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో ప్రధా నమంత్రి సూర్యఘర్‌ యోజన పథకానికి సంబం ధించి అర్తమూరు గ్రామం ఎంపికైన సందర్భం గా జరిగిన కార్యక్రమానికి మాజీ సర్పంచ్‌ ఎన్‌. వీర్రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యేతోపాటు, విద్యుత్‌శాఖ జిల్లా ఎస్‌ఇ రాజ బాబు, సోలార్‌ సంస్థ ప్రతినిధులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ ఎస్‌ఇ రాజ బాబు మాట్లాడుతూ వినియోగదారుడే విద్యుత్‌ ను ఉత్పత్తి చేసి దాన్నించి ఆదాయం పొందేలా కేంద్ర ప్రభుత్వం సోలార్‌ పలకలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించిందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో సోలార్‌ విద్యుత్‌ ను ఏర్పాటు చేస్తామన్నారు. నూరుశాతం సోలా ర్‌ను ఏర్పాటు చేసుకున్న గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1కోటి వరకు నగదు అందిస్తుంద న్నారు. సోలార్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు అవిష్క రించారు. సోలార్‌ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ రాయితీతోపాటు, బ్యాంకు రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సభలో ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండలంలోని టేకి, మండపేట పట్టణంలో రెండు విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. అర్తమూరు గ్రామంలో త్వరలో డ్వాక్రా భవన్‌ నిర్మిస్తామన్నారు. అర్తమూరులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు సన్మానం: అర్తమూరు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే వేగుళ్లను టీడీపీ నేతలు, ఉద్యో గులు సత్కరించారు. విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ రాజ బాబును సహచర ఉద్యోగులు, స్థానిక నేతలు సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గోలుగూరి అన్నపూర్ణ, ఉపసర్పంచ్‌ కె.సత్యనారాయణ రెడ్డి, పి.సుబ్బారెడ్డి, మండపేట మండల తహశీల్దార్‌ తేజేశ్వరరావు, ఈవోపీఆర్డీ దాసరి శ్రీనివాసరావు, విద్యుత్‌శాఖ అధికారులతో పాటు స్థానిక నేతలు పడాల సుబ్బారెడ్డి, తాడి శేషారెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 01:12 AM