సోలార్ రూప్ టాప్ ఏర్పాటుతో విద్యుత్ బిల్లుల ఆదా
ABN , Publish Date - Aug 29 , 2024 | 01:26 AM
తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటిపైనా సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చని ఏపీఈపీడీిసీఎల్ రాజమహేంద్రవరం రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్‌వర్మ అన్నారు.
ఏపీఈపీడీసీఎల్ ఈఈ శ్రీధర్‌వర్మ
అనపర్తి, ఆగస్టు 28 : తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటిపైనా సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చని ఏపీఈపీడీిసీఎల్ రాజమహేంద్రవరం రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్‌వర్మ అన్నారు. బుధవారం అనపర్తి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సోలార్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ ఖర్చు అవ డమే కాకుండా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అంతే కాకు ండా బ్యాంకుల ద్వారా రుణం కూడా మంజూరవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి స్లాబ్‌ల పైన సోలార్ రూప్ టాప్‌ను సులభతరంగా ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. సోలార్ ద్వార ఒక కిలోవాట్‌కు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తద్వారా రూ. 1000వచ్చే బిల్లు రూ.338 మాత్రమే వస్తుందని కిలోవాట్‌కు ఏడాదికి రూ.8వేలు ఆదా కావడమే కాకుండా రూ.30వేల సబ్సిడీ లభిస్తుందన్నారు. ఈ సందర్బంగా సోలార్ రూప్ టాప్‌కు సంబ ంధించిన బ్రోచర్లను ఆయన స్థానిక అధికారులతో కలిసి ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిరంజన్‌బాబు, ఎల్‌ఐ శేషగిరి, షిప్టు ఆపరేటర్ జ్యోతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ బిల్లుల భారాన్ని ఉపసంహరించాలి
సీపీఎం డిమాండ్
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 28 : విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ప్రజలపై వేసిన విద్యుత్ భారాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000లో విద్యుత్ ధరల పెరుగుదలకు, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో మృతి చెందిన రామకృష్ణ, విష్ణువర్థనరెడ్డి, బాలస్వామి చిత్రపటాలకు సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ అదానీ కంపెనీ నుంచి స్మార్టుమీటర్లు రాష్ట్రానికి చేరుకున్నాయని, ప్రయోగాత్మకంగా ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో బిగించిన స్మార్టు మీటర్లకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళన చేశారని, వీటివల్ల విద్యుత్ ధఽరలు పెరగడమే కాకుండా రైతుల 9 గంటల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే అవకాశం ఉందని అన్నారు. తక్షణం స్మార్టుమీటర్ల బిగింపు మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి బి.పవన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుందర్‌బాబు పాల్గొన్నారు.