Share News

జవానుల త్యాగ నిరతికి ప్రతీక పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:01 AM

కేంద్ర రిజర్వు పోలీ సు దళం(సీఆర్పీఎఫ్‌) జవానుల త్యాగ నిరతికి ప్రతీక పోలీసు అమరవీరుల సంస్మరణ దినమని 42వ బెటాలియన్‌ కమాండెంట్‌ ధరమ్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు.

జవానుల త్యాగ నిరతికి ప్రతీక పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
రాజమహేంద్రవరంలో నివాళులర్పిస్తున్న సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌

  • 42వ బెటాలియన్‌ కమాండెంట్‌ ధరమ్‌ ప్రకాశ్‌

రాజమహేంద్రవరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర రిజర్వు పోలీ సు దళం(సీఆర్పీఎఫ్‌) జవానుల త్యాగ నిరతికి ప్రతీక పోలీసు అమరవీరుల సంస్మరణ దినమని 42వ బెటాలియన్‌ కమాండెంట్‌ ధరమ్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. బెటాలియన్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మ రణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. 1959లో అక్టోబరు 21న లద్దాక్‌ సమీపంలోని హాట్‌స్ర్పింగ్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవానులు వీరోచిత పోరాటం చేసి శత్రువులు మన దేశంలో చొరబడ కుండా నిలువరించారని, ఆ సమయంలో ప్రాణా లను తృణప్రాయంగా అర్పించారని ఈ సంద ర్భంగా కమాండెంట్‌ గుర్తు చేశారు. గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకూ ప్రాణాలు కోల్పోయిన రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది పేర్లను ఆయన చదివి వినిపించారు. ఆయా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిం చారు. అమర పోలీసుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత దేశ పౌరులందరికీ ఉంద న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్‌ బి.రత్నమ్మ, అసిస్టెంట్‌ కమాండెంట్‌ సంతోష్‌ కుమార్‌ సింగ్‌ తదితరలు పాల్గొని పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.

Updated Date - Oct 22 , 2024 | 01:01 AM