సోమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Oct 01 , 2024 | 12:53 AM
పట్టణంలోనున్న బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీకాకోళపు లక్ష్మీ నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు
నిడదవోలు, సెప్టెంబరు 30: పట్టణంలోనున్న బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీకాకోళపు లక్ష్మీ నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు లక్ష బిల్వా ర్చన, అమ్మవారికి కుంకుమ పూజలు, సహస్ర నామార్చన నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో పలువురు భక్తులు స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సోమాల శివ వాటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.