పట్టుదల.. పవర్ లిఫ్టింగ్!
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:28 AM
ఇతన్నెక్కడో చూసినట్టు ఉందే.. అనుకుంటు న్నారా..రాజమహేంద్రవరం ప్రజలకు కాస్త సుప రిచితుడే..క్రీడాకారుడిగా కాదండోయ్.. పారిశుధ్య కార్మికుడిగా..
ఇతన్నెక్కడో చూసినట్టు ఉందే.. అనుకుంటు న్నారా..రాజమహేంద్రవరం ప్రజలకు కాస్త సుప రిచితుడే..క్రీడాకారుడిగా కాదండోయ్.. పారిశుధ్య కార్మికుడిగా..మరి ఇదేంటి అంటారా.. అదే మరి పట్టుదల ఉంటే కానిదిలేదు..తపన ఉంటే సాధిం చలేనిదిలేదనడానికి ఇతనే నిదర్శనం.. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న అర్జి బాలకృ ష్ణకు చిన్నతనం నుంచి పవర్ లిఫ్టింగ్ అంటే ఇష్టం..అయితే రెక్కాడితే కానీ డొక్కాడని జీవి తం ..దీంతో రాజమహేంద్రవరం పారిశుధ్య విభా గం లో 2014 నుంచి పనిచేస్తున్నాడు. ఇటు ఉద్యో గం చేసుకుంటూఅటు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ అనేక బహుమతులు కైవసం చేసుకున్నాడు.ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు చెన్నై సేలంలో జరిగిన సౌలిండియా నేషనల్ పవర్ లిప్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాడు. 74 కేజీల విభాగంలో 10 మంది క్రీడాకారులకు దీటుగా పోటీ ఇచ్చి విజేతగా నిలిచాడు. - రాజమహేంద్రవరం సిటీ