Share News

వంగలపూడిలో నిలిచిన ఇసుక రవాణా

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:57 AM

వంగలపూడి ఇసుక ర్యాంపు నుంచి శనివారం ఇసుక రవాణా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంగలపూడి ఇసుక ర్యాంపులో ఇసుక కూలీలతో ఇసుక తవ్వకాలు జరిపి ట్రాక్టర్లలో లోడింగ్‌ చేసుకుని స్టాక్‌పాయింట్‌కు చేర్చవలసి ఉంది. ఇందుకు గాను కూలీలకు రూ.200 ట్రా క్టర్‌కు రూ.150 యాజమాన్యం చెల్లిస్తోంది.

వంగలపూడిలో నిలిచిన ఇసుక రవాణా
ర్యాంపు వద్ద నిరసన తెలుపుతున్న ట్రాక్టర్‌ డ్రైవర్లు

  • సొమ్ములు గిట్టుబాటు కావడం లేదని కూలీలు, ట్రాక్టర్‌ డ్రైవర్లు నిరసన

సీతానగరం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వంగలపూడి ఇసుక ర్యాంపు నుంచి శనివారం ఇసుక రవాణా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంగలపూడి ఇసుక ర్యాంపులో ఇసుక కూలీలతో ఇసుక తవ్వకాలు జరిపి ట్రాక్టర్లలో లోడింగ్‌ చేసుకుని స్టాక్‌పాయింట్‌కు చేర్చవలసి ఉంది. ఇందుకు గాను కూలీలకు రూ.200 ట్రా క్టర్‌కు రూ.150 యాజమాన్యం చెల్లిస్తోంది. అయితే ఆ సొమ్ము గిట్టుబాటు కావడం లేదని , కూలిపని కూడా రావడం లేదని కూలీలు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, ట్రాక్టర్‌ యజమానులు నిరసనకు దిగడంతో ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్దకు ఇసుక చేరకపోవడంతో స్టాకు ఉన్నంత వరకు ఇసుక రవాణా జరిగినా స్టాక్‌ పాయింట్‌ వద్ద ఇసుక అయిపోవడంతో రవాణా నిలిచిపోయింది. ట్రాక్టర్‌కు రూ.200, కూలీలకు రూ.250 ర్యాంపు నిర్వాహకులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ర్యాంపు నిర్వాహకులు శనివారం కూలీలు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, యజమానులతో సంప్రదింపులు జరపకపోవడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది.

Updated Date - Nov 17 , 2024 | 12:57 AM