Share News

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:22 AM

: స్ధానిక జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో శుక్రవారం మండలస్థాయి బాలికల క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఆటల పోటీలను పాఠశాల హెచ్‌ఎం వంగా శ్రీనివాస్‌ ప్రారంభించారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
కపిలేశ్వరపురంలో కబడ్డీ పోటీల్లో విద్యార్థినులు

మండల స్థాయి క్రీడా పోటీలు

కపిలేశ్వరపురం, సెప్టెంబరు 20: స్ధానిక జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో శుక్రవారం మండలస్థాయి బాలికల క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఆటల పోటీలను పాఠశాల హెచ్‌ఎం వంగా శ్రీనివాస్‌ ప్రారంభించారు. అండర్‌-17 బాలుర ఖోఖో పోటీల్లో కపిలేశ్వరపురం విద్యార్థులు విన్నర్‌గాను, నల్లూరు విద్యార్థులు రన్నర్‌గాను నిలిచినట్లు పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌, మండల పీడీ గుబ్బల వేణుగోపాల్‌రావు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు ముత్తా సత్యనారాయణ, మేకా సత్యనారాయణ, దుర్గాప్రసాద్‌, బేగం, రవికుమార్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కొమరగిరిపట్నం హైస్కూల్‌లో..

అల్లవరం: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని జడ్పీ టీసీ కొనుకు గౌతమి అన్నారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం జడ్పీ హైస్కూల్‌లో 68వ మండలస్థాయి క్రీడా పోటీలను జడ్పీటీసీ గౌతమి, సర్పంచ్‌లు రాకాపు విజయలక్ష్మి, వడ్డి సుభాషిణి ప్రారంభించారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. అండర్‌-17, 14 విభాగాలలో కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో క్రీడాకారుల ఎంపిక పోటీలు జరిగాయి. ఓడలరేవు, దేవగుప్తం, గోడిలంక, బోడసకుర్రు, కోడూరుపాడు, అల్లవరం, గోడి గురుకుల, హర్షవిజ్ఞాన భారతి స్కూల్‌లో పాటు తొమ్మిది హైస్కూల్‌ విద్యార్థులు ఆటల పోటీల్లో తలపడ్డారు. హెచ్‌ఎం జీఎస్పీ రమణ, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సుంకర వాసు, ఎంఈవోలు కిరణ్‌బాబు, ఏడుకొండలు, ఎంపీటీసీలు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, ఎం.శ్రీని వాస్‌, పి.రాజేశ్వరి, పీఈటీలు యుఎస్వీ ముసలయ్య, కె.ఈశ్వరరావు, ఏ.దుర్గాప్రసాద్‌, కె.వెంకటేశ్వరరావు, బొంతు ప్రసాద్‌, కె.త్రిమూర్తులు, ఎం.రమేష్‌ పాల్గొన్నారు.

ఉప్పలగుప్తం: గొల్లవిల్లి జడ్పీ హైస్కూల్లో శుక్రవారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బాలికలకు అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో మండల స్థాయి ఆటల పోటీలు, నియోజకవర్గ స్థాయి ఎంపికలు నిర్వహించారు. వ్యాయామోపాధ్యాయులు గొలకోటి ఫణీంద్రకుమార్‌, కామన మధు, పి.విఘ్నేశ్వరుడు, డి.సరస్వతి, ఐశ్వర్య, కరాటం ప్రసాద్‌ పోటీలను పర్యవేక్షించారు. హెచ్‌ఎం లంక రాణి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పీఎంసీ చైర్మన్‌ వాలా సత్యనారాయణ, జడ్పీటీసీ గెడ్డం సంపదరావు, సర్పంచ్‌ జొన్నాడ శ్రీదుర్గాచిన్నా, గుత్తాల సుభాష్‌చంద్రరావు, పిల్లా బుజ్జి, అరిగెల నరేష్‌, మంచెం బాలకృష్ణ, గొలకోటి దొరబాబు, చప్పిడి వెంకటనాగేశ్వరరావు, నల్లా సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:23 AM