Share News

వాడపల్లిలో సినీనటుడు శుభలేఖ సుధాకర్‌ పూజలు

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:48 AM

ఆత్రేయపురం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం సినీనటుడు శుభలేఖ

వాడపల్లిలో సినీనటుడు శుభలేఖ సుధాకర్‌ పూజలు
వేంకటేశ్వరస్వామి ఆలయంలో సినీనటుడు శుభలేఖ సుధాకర్‌

ఆత్రేయపురం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం సినీనటుడు శుభలేఖ సుధాకర్‌ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని వేద ఆశీర్వచనం అందుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో సుధాకర్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Dec 10 , 2024 | 12:48 AM