Share News

124 టన్నుల పంచదార వెనక్కి

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:51 AM

పౌరసరఫరాల సంస్థ జిల్లాలో రేషన్‌, ఐసీడీఎస్‌ నిమిత్తం సరఫరా చేస్తున్న పంచదార,కందిపప్పు పలు రకాల నిత్యావసరాలు పంపిణీ చేస్తుం ది.

124 టన్నుల పంచదార వెనక్కి

కాటా తేడా కారణం

వచ్చే నెల బియ్యం ఒకటే పంపిణీ

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

పౌరసరఫరాల సంస్థ జిల్లాలో రేషన్‌, ఐసీడీఎస్‌ నిమిత్తం సరఫరా చేస్తున్న పంచదార,కందిపప్పు పలు రకాల నిత్యావసరాలు పంపిణీ చేస్తుం ది. పంచదార, కందిపప్పు తూకాల్లో తేడాలు గమనించిన కూటమి ప్రభు త్వం గత వైసీపీ ప్రభుత్వంలోని కాంట్రాక్టర్లపై కేసు పెట్టడంతో పాటు సరుకు జిల్లాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. జిల్లాలో 124.5 టన్నుల పంచదారను తిరిగి పంపించేశారు. కోరుకొండలో ఐసీడీఎస్‌కు సం బంధించి 1.5 టన్నుల కందిపప్పులో తేడా ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని అక్కడ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో జూలై నెల రేషన్‌లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయనున్నారు. జూలైలో ఇవ్వవలసిన పంచదార,కందిపప్పు కూడా ఆగస్టు నెలలో రెండు నెలలది ఇవ్వనున్నారు.వైసీపీ ప్రభుత్వంలో కాటా కోటాలో తేడాలతో పాటు, గత అక్టోబరు నుంచి కందిపప్పు కూడా ఇవ్వని సంగతి తెలిసిందే.

Updated Date - Jun 28 , 2024 | 12:51 AM