Share News

పాత సర్వే ప్రకారం రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:16 AM

కోటిపల్లి నుంచి నరసాపురం వరకు ఏర్పాటు చేసే రైల్వేలైన్‌ కొరకు పాశర్లపూడి నుంచి చించినాడ వరకు పాతసర్వే ప్రకారం రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు శుక్రవారం మొగలికుదురులో నిరసన తెలిపారు.

పాత సర్వే ప్రకారం రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలి

మామిడికుదురు, నవంబరు 15 (ఆంధ్ర జ్యోతి): కోటిపల్లి నుంచి నరసాపురం వరకు ఏర్పాటు చేసే రైల్వేలైన్‌ కొరకు పాశర్లపూడి నుంచి చించినాడ వరకు పాతసర్వే ప్రకారం రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు శుక్రవారం మొగలికుదురులో నిరసన తెలిపారు. 2002లో చేసిన సర్వే ప్రకారం కాకుండా ఇటీవల కొత్తగా రైల్వే సర్వే పనులు చేస్తున్నారని, దాని వల్ల తమ విలువైన భూములు, భవనాలు కోల్పోతున్నామని నగరం, మొగలికుదురు, గెద్డాడ, పాలగుమ్మి తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పాత సర్వే ప్రకారమే రైల్వేలైన్‌ ఏర్పాటు చేయా లని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చ రించారు. రైల్వే అధికారులకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. ఈసందర్భంగా అయినవిల్లి ఎస్‌ఐ జోషి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. నిరసనలో జాలెం సుబ్బారావు, కోళ్ల సురేష్‌బాబు, కడలి బాబురావు, దొంగ సత్తిబాబు, తాటి కాయల ఉదయభాస్కరావు, రాయుడు ఆనం దరావు, జేటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:16 AM