Share News

ఇక యుద్ధమే..

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:12 AM

జిల్లాలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీ లన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుతో కొందరు సీనియర్‌ నేతలకు న్యాయం జరగలేదు. కానీ ప్రజావ్య తిరేక విధానాలు అవలభిస్తున్న అధికార వైసీపీని గద్దెదించడం, రాష్ట్ర భవిష్య త్‌ను కాపాడడం, ప్రజలకు శాంతిభద్రతలు కల్పించడమే లక్ష్యాలుగా ఏకమైన ఈ కూటమి వల్ల కొందరు త్యాగాల తప్పవని, వారందరికీ అధికారంలోకి రాగానే స్థాయికి తగ్గని విధంగా హోదా కల్పిస్తామనే హామీలు ఇస్తూ, బుజ్జగిస్తూ పార్టీలు ముందుకుపోతున్నాయి. వైసీపీ కూడా మొత్తం అభ్య ర్థులను ఖరారుచేసింది.

ఇక యుద్ధమే..

  • ప్రధాన పార్టీ అభ్యర్థుల ఖరారు

  • ఆరని అసమ్మతి సెగలు

( రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీ లన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుతో కొందరు సీనియర్‌ నేతలకు న్యాయం జరగలేదు. కానీ ప్రజావ్య తిరేక విధానాలు అవలభిస్తున్న అధికార వైసీపీని గద్దెదించడం, రాష్ట్ర భవిష్య త్‌ను కాపాడడం, ప్రజలకు శాంతిభద్రతలు కల్పించడమే లక్ష్యాలుగా ఏకమైన ఈ కూటమి వల్ల కొందరు త్యాగాల తప్పవని, వారందరికీ అధికారంలోకి రాగానే స్థాయికి తగ్గని విధంగా హోదా కల్పిస్తామనే హామీలు ఇస్తూ, బుజ్జగిస్తూ పార్టీలు ముందుకుపోతున్నాయి. వైసీపీ కూడా మొత్తం అభ్య ర్థులను ఖరారుచేసింది. కానీ వారిలో గ్రూపులు పెరుగుతూనే ఉన్నాయి. అసమ్మతి ఆరలేదు. సుమారు 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. వచ్చే నెల అంటే ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. అప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 29తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. మే 13న పోలింగ్‌. ఇప్పటివరకూ చాలారోజులు ఉన్నాయిలే అనుకున్నారు.. కానీ కౌండ్‌డౌన్‌ మొద లైంది. రోజులు చకచకా మారిపోతున్నాయి. జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్‌ స్థానం ఉండగా టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను ఖరా రు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, రెండు అసెంబ్లీ స్థానాల్లో జనసేన, పార్లమెంట్‌తోపాటు ఒక అసెంబ్లీ స్థానంలో బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ తొలి జాబితాలోనే అనపర్తి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, అనూహ్యంగా బీజేపీ కోటాలోకి పోయింది. ఇక రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, గోపాలపురం, కొవ్వూ రు స్థానాల నుంచి టీడీపీ, నిడదవోలు, రాజానగరం నుంచి జనసేన ఉమ్మడి అభ్యర్థులను పోటీపెట్టగా, రాజమహేంద్రవరం లోక్‌సభ, అనపర్తి అసెంబ్లీ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. గత శనివారం వైసీపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీలో ఎస్సీ, బీసీ అభ్యర్థుల అసెంబ్లీ స్థానాలను బదిలీ చేయడంతో ఆయా వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఈసారి జిల్లాలో టీడీపీ- జనసేన, బీజేపీ కూటమి నుంచి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు, రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, అనపర్తి నుంచి ఎం. శివకృష్ణంరాజు తొలిసారి ఎన్నికల బరిలోకి వచ్చారు. వాసు, వెంకట్రాజు విద్యావంతులు కాగా, బలరామకృష్ణ వ్యాపారి, ఆధ్యాత్మికవేత్త. కృష్ణంరాజు ఎక్స్‌ మిలట్రీ మ్యాన్‌. ఇక నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్‌ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన నాయకుడు. రాజమహేం ద్రవరం రూరల్‌ టీడీనీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూడా. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గతంలో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కూటమి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్‌ కుమార్తె. కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌ రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆయన డాక్టర్‌. అనుకోకుండా ఎంపీ బరిలోకి దిగారు.

రాజమహేంద్రవరం సిటీలో వాసు వర్సెస్‌ భరత్‌

రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు, వైసీపీ అభ్య ర్థిగా ఎంపీ మార్గాని భరత్‌ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇది టీడీపీకి కంచుకోట. 2019లో వైసీపీ గాలి వీచిన సమయంలో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు సతీమణి ఆదిరెడ్డి భవానీ గెలిచారు. పైగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈనేపథ్యంలో టీడీపీ- జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు బలంగా జనంలోకి వెళుతు న్నారు. వైసీపీలో గ్రూపులెక్కువ. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రౌతు సూర్యప్రకాశరావు పోటీచేసి ఓడిపోయారు. వైసీపీ సీనియర్‌ నేతలను పక్కన పెట్టారన్న అసంతృప్తి ప్రస్తుత సిటీ అభ్యర్థి భరత్‌కు తగలనుంది.

రూరల్‌లో గోరంట్ల వర్సెస్‌ చెల్లుబోయిన

రాజమహేంద్రవరం రూరల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగగా, వైసీపీ అభ్య ర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణు రంగంలోకి దిగారు. కానీ ఆయనను రామ చంద్రపురం నుంచి ఇక్కడకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ కేవలం బలహీనవర్గాలనే ఒక నియోజకవర్గంలో ఉండనీయకుండా, ఇక్కడకు బదిలీ చేశారనే విమర్శ ఉంది. అంతేకాక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు పోటీ చేశారు. ఈసారి ఆయనకు సీటు దక్కలేదు. ఇక్కడ వైసీపీ కోఆర్డినేటర్‌గా కష్టపడిన చందన రమేష్‌ను పార్టీ అన్యాయం చేసిం దనే వాదన కూడా ఉంది. ఇలా స్థానికంగా ఆ పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది. ఇక కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రెండు దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడో సారి ఇప్పుడు ఎన్నికలకు వెళుతున్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాలతో నూ మంచి సంబంధాలు ఉన్న నేతగా ఆయనకు పేరుంది.

రాజానగరంలో బత్తుల వర్సెస్‌ జక్కంపూడి

రాజానగరంలో జనసేన తరపున కూటమి అభ్యర్థిగా బత్తుల బల రామ కృష్ణ బరిలోకి దిగారు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరోసారి బరిలోకి దిగారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు. ఈసారి ఎలాగైనా గెలవాలని కూటమి అభ్యర్థి పనిచేస్తున్నారు. ఇక్కడ టీడీపీ టిక్కెట్టు ఆశించిన నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడానికి ముందుకురావడం కూటమికి కలిసొచ్చే అంశం. ఎక్కడా అసంతృప్తి లేకుండా కలసి ముందుకు సాగుతున్నారు.

అనపర్తిలో కృష్ణంరాజు వర్సెస్‌ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి అనూహ్యంగా సీటు లభించింది. ఇక్కడ టీడీపీ తొలి జాబితాలోనే టీడీపీ తరపున కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించగా, పొత్తు వల్ల ఈ సీటును బీజేపీ తీసుకుంది. తర్వాత రంగాపురానికి చెందిన ఎక్స్‌మిలట్రీ కృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించింది. ఇది టీడీపీ కేడర్‌కు ఇబ్బంది. ఇక్కడ పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేని విధంగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి కృష్ణంరాజు ఇక రంగంలోకి దిగారు. ఆయనతో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్య నారాయణరెడ్డి తలపడనున్నారు. ఇక్కడ వైసీపీ మీద ప్రజల్లో ఉన్న వ్యతి రేకత, అభివృద్ధి ఏమాత్రం లేకపోవడం వైసీపీకి మైనస్‌గా ఉన్నాయి.

కొవ్వూరులో ముప్పిడి వర్సెస్‌ తలారి

కొవ్వూరు నియోజకవర్గంలో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్ద రూ కూడా గోపాలపురం నియోజకవర్గం నుంచి దిగుమతి అయినవాళ్లే. కానీ వీరిద్దరూ మూడు ఎన్నికల నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. 2014 లో ముప్పిడి వెంకటేశ్వరరావు గెలవగా, 2019లో తలారి వెంకట్రావు గెలిచా రు. ఈసారి కొవ్వూరు నుంచి టీడీపీ తరపున ముప్పిడి, వైసీపీ తరపున తలారి పోటీపడుతున్నారు. ఇక్కడ గెలిచి మంత్రి పదవి దక్కించుకుని, ఇవాళ గోపాలపురం బదిలీ అయిన తానేటి వనిత వైఖరి వల్ల వైసీపీ రెం డుగా చీలిపోయింది. ఇక టీడీపీ అభ్యర్థి ముప్పిడిని ఓ ప్రధాన వర్గం కావా లని తీసుకొచ్చింది. టీడీపీ ద్విసభ్య కమిటీ కష్టపడి పనిచేస్తోంది. ఇక్కడ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి జవహర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సానుకూలం వాతావరణం నెలకొంటోంది.

గోపాలపురం నుంచి మద్దిపాటి వర్సెస్‌ మంత్రి తానేటి

గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఈసారి టీడీపీ తరపున కూట మి అభ్యర్థిగా విద్యావంతుడైన మద్దిపాటి వెంకట్రాజు రంగంలో ఉన్న సంగ తి తెలిసిందే. ఆయన రాష్ట్ర హోంమంత్రి, వైసీపీ అభ్యర్థిని తానేటి వనితపై పోటీకి దిగారు. ఇక్కడ కూటమి బలంగా ఉంది. కానీ ఇక్కడ మద్దిపాటికి, మాజీ జెడ్పీ చైర్మన్‌ ముళ్లపాటి బాపిరాజు వర్గం ఇంకా సహకరించడంలేదు. ఇటీవల కొందరు పెద్దలు జోక్యంచేసుకుని, అసమ్మతి బుజ్జగించే ప్రయత్నా లు జరుగుతున్నట్టు సమాచారం. వైసీపీ అభ్యర్థిని హోంమంత్రి తానేటి వని త గతంలో కొవ్వూరు వ్యవహరించిన తీరు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. అది ఆమెకు పెద్ద సమస్యే. వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను అధిగమించి ఎన్నికల్లో ముందుకు సాగడం మరో సమస్య.

నిడదవోలులో దుర్గేష్‌ వర్సెస్‌ శ్రీనివాస్‌నాయుడు

నిడదవోలు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన తరపున మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నా యుడుపై పోటీపడుతున్నారు. ఇక్కడ టీడీపీకి టిక్కెట్‌ రాకపోవడంతో ఏర్ప డిన అసంతృప్తి కూడా చల్లారిందని భావిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వర్గం మొదట జనసేన అభ్యర్థిని వ్యతిరేకించినా, చంద్రబాబుతో శేషారావు భేటీ అయిన తర్వాత సమస్య సద్దుమణిగింది. కూటమి అభ్యర్థి దుర్గేష్‌ కోసం శేషారావు కలిసి పనిచేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన శ్రేణులు ప్రతి గ్రామంలో కలసి పనిచేసేలా ముందుకు సాగుతున్నారు. అయితే తెలుగుదేశంలో మరొక వర్గం మాత్రం అలక వహించింది. ఇక్కడ శేషారావుతోపాటు టిక్కెట్‌ ఆశిం చిన సీనియర్‌ నేత, వ్యాపారవేత్త కుందుల సత్యనారాయణ.. జనసేన అభ్య ర్థిని ప్రకటించిన వెంటనే ఆయన స్వాగతించారు. చంద్రబాబు సీఎం కావడ మే తన లక్ష్యమని, ఎవరికి సీటిచ్చినా తనకు అభ్యంతరం లేదని బహిరం గంగా ప్రకటించారు. కానీ గురువారం ఆయన, తన అనుచరుల్లోని ముఖ్యు లతో సమావేశమయ్యారు. ఇంతవరకూ ప్రచారంలోకి కుందులను ఆహ్వా నించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం.

Updated Date - Mar 29 , 2024 | 02:12 AM