Share News

వైసీపీ నాయకులు వద్దు!

ABN , Publish Date - Dec 20 , 2024 | 11:55 PM

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన వైసీపీ నాయకులు మాకొద్దు అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నాయకులు వద్దు!
వైసీపీ నాయకులను చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

గత ఐదేళ్లు ఎంతో కష్టపడ్డాం

టీడీపీ పేరు చెబితే వేధించారు

మాపై కేసులు పెట్టారు..

నేటికీ స్టేషన్లకు వెళుతున్నాం

రాజీవ్‌కృష్ణను ఎలా చేర్చుకుంటారు

నిలదీసిన టీడీపీ నాయకులు

సర్దిచెప్పిన ద్విసభ్య కమిటీ

అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం

ఎమ్మెల్యే ముప్పిడి

కొవ్వూరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన వైసీపీ నాయకులు మాకొద్దు అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశం రసాబాసగా మారింది. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ సభ్యత్య నమోదు వేగవంతం చేయాలని చెబుతుండగా కార్యకర్తలు, నాయకులు స్టేజి వద్దకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ఐదేళ్లు టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించిన రాజీవ్‌కృష్ణ, అతని అనుచరులను నియోజకవర్గ నాయకులకు తెలియకుండా టీడీపీలో చేర్చుకోవడాన్ని తప్పుబట్టారు. బి.గంగరాజు మాట్లాడుతూ రాజీవ్‌కృష్ణతో పాటు మరి కొంత మంది వైసీపీ నాయకులు టీడీపీ కండువాలు కప్పుకోవడంతో గ్రామాల్లో అందరూ ఎగ తాళి చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన కేసులకు ఈ రోజుకి స్టేషన్‌కు వెళ్లి సంతకాలు పెడుతున్నామన్నారు. తాళ్లపూడి మండల అధ్యక్షుడు నామాన పరమేష్‌ మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ నాయకులను ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్ని ంచారు. నాదెళ్ళ శ్రీరామ్‌ మాట్లాడుతూ ఐదేళ్లు కష్టపడ్డాం.. పార్టీ గెలిచిందన్న ఆనందం ఆరు నెలలు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు గౌరవం అందించాలని డిమాండ్‌ చేశారు.ఐటీడీపీ ఇన్‌చార్జి గెల్లా సురేష్‌ మాట్లాడుతూ వైసీపీ నాయకులతో కుమ్మకై మాజీ మంత్రి జవహర్‌ కొవ్వూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీల రాజకీయం ఆరంభించారన్నారు. బీసీ నాయకుడు కాగిత రఘు మాట్లాడుతూ టీడీపీ నాయకులపై కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టిన నాయకులను ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారన్నారు. నియోజకవర్గంలో మళ్లీ గ్రూపు రాజకీయాలు మొదలయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు గౌర వం అం దించాలన్నారు. రాజీవ్‌కృష్ణ, అతని అను చరులను పార్టీలో చేర్చడానికి మాజీ మంత్రి కె. జవహర్‌, అతని కుమారుడు ఆశిష్‌లాల్‌ సహకరించడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాపై కూడా 15 కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. నా కారుపై దాడిచేశారు. కార్యకర్తలు బాధ, ఆవేదన నూటికి నూరు శాతం నిజం. కార్యకర్తల ఆవేదనను నియోజకవర్గ నా యకుడు పెండ్యాల అచ్చిబాబు సమక్షంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల దృష్టికి తీసుకువెళ్తానన్నారు.మిమ్మల్ని కాదని కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడం జరగదన్నారు. కార్యక్రమంలో మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్‌, దాయన రామకృష్ణ, నామాన పరమేష్‌, వట్టికూటి వెంకటేశ్వరరావు, రాజాన శ్రీనివాస్‌, మరపట్ల కళాధర్‌, ఎస్సీ , రజక కార్పొరేషన్‌ డైరెక్టర్లు వేమగిరి వెంకట్రావు, సతీష్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 11:55 PM