Share News

రోజాకు సారె, చీర పంపిస్తున్నాం

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:42 AM

వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించారని కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కో కోఆర్డినేటర్‌ కటకంశెట్టి ప్రభాకర్‌ (బాబి) అన్నారు.

రోజాకు సారె, చీర పంపిస్తున్నాం

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 5: వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించారని కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కో కోఆర్డినేటర్‌ కటకంశెట్టి ప్రభాకర్‌ (బాబి) అన్నారు. బుధవారం 47వ డివిజన్‌ కరణంగారి సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగళం కోసం లోకేశ్‌పై వైసీపీ నాయకులు అవహేళన చేసి మాట్లాడారని, చరిత్రలో ఎవరికీ రాని మెజారిటీ మంగళగిరిలో లోకేశ్‌కు వచ్చిందన్నారు. లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్‌కుమార్‌ యాదవ్‌, రోజా తదితర మాజీ మంత్రులు ఎన్నికల్లో గాల్లో కొట్టుకుపోయారన్నారు. రోజాకి రాజక్షీయ భిక్ష పెట్టింది టీడీపీ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ సమయంలో రోజా బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారంతా పత్తాలేకుండా పోయారన్నారు. ఓటమిపాలైన రోజా అత్తారింట్లో కాపురం చేసుకునేందుకు టీడీపీ మహిళలు సిద్ధం చేసిన సారె, చీరలు, స్వీట్లను బహుమతిగా పంపుతున్నట్లు తెలిపారు. ఈ బహుమతులు స్వీకరించాలని కాకినాడ కాజా కూడా పంపుతున్నామన్నారు. త్వరలో అన్ని జిల్లాల నుంచి పార్సిల్స్‌లను పంపించనున్నట్లు చెప్పారు. కూటమి ఎమ్మెల్యేగా పంతం నానాజీ, ఎంపీగా ఉదయ శ్రీనివాస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపిండమే కాకుండా టీడీపీ కూటమికి పట్టం కట్టిన ప్రజలు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ మాజీ ఎంపీపీ జి.శ్రీనివాసరావు, కాకరపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ, దేవు వెంకన్న, కొల్లాబత్తుల అప్పారావు, వేటుకూరి నాగమణి, కంచుమర్తి లావణ్య, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 08:14 AM