Share News

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:51 AM

వ్యక్తుల కోసం కాదు పార్టీ కోసం కట్టు బానిసలా పనిచేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ అన్నారు. మా జీ మంత్రి జవహర్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించడంతో గురువారం కొవ్వూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆయనను ఘనంగా సత్కరించారు.

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి

  • వ్యక్తుల కోసం కాదు పార్టీ కోసం కట్టు బానిసలా పనిచేస్తా

  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్‌

కొవ్వూరు, మార్చి 28: వ్యక్తుల కోసం కాదు పార్టీ కోసం కట్టు బానిసలా పనిచేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ అన్నారు. మా జీ మంత్రి జవహర్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించడంతో గురువారం కొవ్వూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆయనను ఘనంగా సత్కరించారు. జవహర్‌ కేక్‌ కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భవిష్యత్‌ తరాల ఉనికి, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావలిసిన సందర్భంలో పొత్తులు వల్ల, స్థానిక పరిస్థితులతో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అందరూ త్యాగాలకు సిద్ధపడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ నిర్ణయం ప్రకారం కొన్నిచోట్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రత్యేకంగా కొవ్వూరులో దేని వల్ల వచ్చిందో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదన్నారు. ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమిస్తూ చంద్రబాబుకు తనపై నమ్మకంతో పార్టీకి జాతీయ ప్రధా న కార్యదర్శిగా నియమించారన్నారు. నియోజకవర్గంలో ప్రతిక్షణం తన వెన్నం టి ఉన్న మిత్రులు చూపించిన ప్రేమ కారణంగానే వేరే చోటికి వెళ్లలేకపోయా నన్నారు. సీటు వచ్చినా రాకపోయిన ఇక్కడే ఉండాలనే దృఢ సంకల్పంతో పనిచేశామన్నారు. ఎన్నికల వరకు ఒక రకంగా, అయిన తరువాత మరో రకంగా ట్రీట్‌ చేసిన సందర్భాలు ఉన్నాయని, అవి పునరావృతం కాకుడదన్నారు. టీడీపీకి కట్టు బానిసలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప వ్యక్తులకు కాదన్నారు. రాబోయో రోజుల్లో పార్టీ శ్రేణులకు అండగా ఇక్కడే ఉంటానన్నారు. ఎవ్వరి దగ్గరకు వెళ్లమని చెప్పడం, ప్రాధేయ పడమనడం ఉండదని, ప్రభు త్వం వచ్చిన తరువాత అందరి పనులు చేస్తానన్నారు. కార్యక్రమంలో వేగి చిన్నా, బూరుగుపల్లి రాఘవులు, కోడూరి ప్రసాద్‌, కరుటూరి సతీష్‌, బొడ్డు రాజు, పసలపూడి బోసు, నరసయ్య, పిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:51 AM