రేపు టీచర్స్ ఎమ్మెల్సీ పోరు
ABN , Publish Date - Dec 04 , 2024 | 01:40 AM
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి(ఎమ్మెల్సీ) ఎన్నికల పోలింగ్ గురు వారం జరగనుంది.
16,737 మంది ఓటర్లు
9న కౌంటింగ్
కలెక్టరేట్ (కాకినాడ)/ రాజమహేంద్రవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి(ఎమ్మెల్సీ) ఎన్నికల పోలింగ్ గురు వారం జరగనుంది.గత ఎన్నికల్లో యూటీ ఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జి రోడ్డు ప్రమా దంలో మృతిచెందడంతో ఈ ఉప ఎన్నిక అని వార్య మైంది.ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశా రు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నిర్వ హిస్తారు. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరగ ను న్నాయి. ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో ఉం డ డంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. యూటీ ఎఫ్ నేత బొర్రా గోపీమూర్తి, గంధం నారా యణ రావు,డా.కవల నాగేశ్వరరావు,పులుగు దీపక్, నామన వెంకట లక్ష్మి(విళ్ల లక్ష్మి) పోటీ పడుతు న్నారు. ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉంటుందని పరిశీల కులు అంచనా. ఇంత వరకూ హోరా హోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.16,737 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాకి నాడ జిల్లాలో 3418 మంది,తూర్పుగోదావరి జిల్లాలో 2990, డాక్టరు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3296, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637, పశ్చిమగోదావరి జిల్లాలో 3729,ఏలూరు జిల్లాలో 2667 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను సురక్షి తంగా కాకి నాడ జేఎన్‌టీయూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు.ఈనెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నెల 12వ తేదీతో ఎన్నికల కోడ్ ముగు స్తుంది. ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు పీవోలు, ఏపీ వోలు,ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లు,సెక్టార్ అధికా రులు, ఇతర సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.ఈ నేప థ్యంలో బుధ, గురువారాలు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డీఆర్వో సీతారామ మూర్తి తెలిపారు.ఆర్ట్స్ కళాశాల వద్ద పోలింగ్ సామగ్రి అందిస్తామన్నారు.
ఎన్నిక ప్రశాంతంగా జరగాలి : కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్
కలెక్టరేట్(కాకినాడ), డిసెంబరు 3 (ఆంధ్ర జ్యోతి) : ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశిం చారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పా ట్లపై మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో అన్ని మండలాల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారత ఎన్ని కల సంఘం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కాకినాడ జిల్లావ్యాప్తంగా 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేసినట్టు తెలిపారు.
ఓటు వేసేందుకు క్యాజువల్ లీవ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు జారీ చేశా రు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఈ నియో జకవర్గ ఉపాధ్యాయ ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమా న్యాలు తగు వెసులుబాటు కల్పిస్తూ విధుల కు ఒక గంట ఆలస్యంగా హాజరయ్యేందుకు, షిప్ట్‌ల అడ్జస్ట్‌మెంటు అనుమతించాలన్నారు.
మద్యం షాపులు బంద్
అమలాపురం టౌన్/యానాం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మద్యం షాపులు, బార్లు మూసి వేయాలని జిల్లా ఎన్నికల అధికారి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 నుంచి గురువారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం డిపోలు, దుకాణాలు, బార్‌లు మూసి ఉంచాలన్నారు. రెండు రోజుల పాటు యానాంలో మద్యం షాపులు మూసివేయనున్నట్టు పుదుచ్చేరి డిప్యూటీ ఎక్సయిజ్ కమిషనర్ తెలిపారు.