Share News

తెలుగు సాహిత్యాన్ని వారసత్వ సంపదగా అందించాలి

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:18 AM

తెలుగు సాహిత్యాన్ని భవిష్యత్‌ తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు తెలుగువారంతా కృషి చేయాలని మహారాష్ట్ర ఆకాశవాణి కేంద్రం ఇంజనీర్‌ ఆర్‌వీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

తెలుగు సాహిత్యాన్ని వారసత్వ సంపదగా అందించాలి

అమలాపురంరూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యాన్ని భవిష్యత్‌ తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు తెలుగువారంతా కృషి చేయాలని మహారాష్ట్ర ఆకాశవాణి కేంద్రం ఇంజనీర్‌ ఆర్‌వీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మాతృ భాష అమృతతుల్యమని, భాల్యం నుంచే పిల్లలకు మాతృబాష పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన, ఉపాధ్యాయులపైన ఉందన్నారు. అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రిన్సిపాల్‌ నూకల శ్రీనివాస్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సాహితీ సదస్సుకు ఆయన ముఖ్య అతిఽథిగా విచ్చేసి ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ ప్రసంగిస్తూ ఇతర భాషల్లో ప్రావీణ్యం పొందాలంటే మాతృభాషను పరిపూర్ణంగా అభ్యసించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కార గ్రహిత, తెలుగు విభాగా ధిపతి డాక్టర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరి మాట్లాడుతూ మాతృమూర్తి, మాతృభాష సర్వదా ప్రాతఃస్మరణీయాలన్నారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పెమ్మరాజు గోపాల్‌, డాక్టర్‌ కేటీ పద్మజ మాతృభాష విశిష్టతను వివరించారు. అతిథి శ్రీనివాస్‌ను కళాశాల తరపున సత్కరించారు.

Updated Date - Nov 16 , 2024 | 01:18 AM