వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:48 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సందడి నెల కొంది.
ఆత్రేయపురం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సందడి నెల కొంది. ఏడువారాల నోము ఆచరిస్తున్న భక్తులు స్వామివారికి అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. అశేష భక్తజనం గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.3,96,036 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి కొవ్వూరుకు చెందిన గీర్ల శ్రీనివాసరావు, ఓంలత దంపతులు రూ.50 వేలు విరాళం ఇవ్వగా వారికి స్వామివారి చిత్రపటం అందించారు.