Share News

దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:26 AM

కోటిపల్లి శ్రీఛాయా సోమేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూముల్లో శుక్రవారం అధికారులు ఆక్రమణలు తొలగించారు. ఆలయం ఎదురుగా ఉన్న సోమగుండం చెరువును ఆనుకుని కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. షెడ్డూలు, శాశ్వత నిర్మాణాలు చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో దేవదాయశాఖ అధికారులు ఆక్రమణదారులకు గతంలో నోటీసులు జారీ చేశారు.

దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపు
ఆక్రమణల తొలగిస్తున్న అధికారులు

కె.గంగవరం, సెప్టెంబరు 20: కోటిపల్లి శ్రీఛాయా సోమేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూముల్లో శుక్రవారం అధికారులు ఆక్రమణలు తొలగించారు. ఆలయం ఎదురుగా ఉన్న సోమగుండం చెరువును ఆనుకుని కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. షెడ్డూలు, శాశ్వత నిర్మాణాలు చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో దేవదాయశాఖ అధికారులు ఆక్రమణదారులకు గతంలో నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆక్రమణదారుల నుంచి ఏవిధమైన స్పందన లేకపోవడంతో ఏసీ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో రామచంద్రపురం డీఎస్పీ బి.రామకృష్ణ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు. 5సెంట్లు స్థలాన్ని దేవస్థానం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలగింపు ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఓలేటి లక్ష్మి తమ షెడ్డు కూల్చివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు నిలువ నీడ లేదని ఇదే ఆధారమని బోరున విలపించింది. అలాగే పోలీసులు ఆక్రమణలో ఉన్న అవుట్‌ పోస్టును స్వాధీనం చేసుకుని పోలీస్‌ అవుట్‌ పోస్టుగా బ్యానర్‌ ఏర్పాటు చేశారు. సీఐలు అశోక్‌కుమార్‌, దొరరాజు, జి.వెంకటేశ్వరరావు, పామర్రు ఎస్‌ఐ జానీబాషా, దేవస్థానం ఈవో శ్రీదేవి, దేవదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:26 AM