Share News

దేవస్థానం భూముల శిస్తు పెంపుపై నిరసన

ABN , Publish Date - May 17 , 2024 | 12:07 AM

పంటకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

దేవస్థానం భూముల శిస్తు పెంపుపై నిరసన

అంతర్వేది, మే 16: పంటకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంతర్వేది రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన కౌలు రైతుల శిస్తులు పెంచొద్దని దేవస్థానం సహాయ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. అనేకమంది రైతులు శిస్తులు చెల్లించారని, మిగిలిన బకాయిలు చెల్లించడానికి పది రోజుల వ్యవధి ఇవ్వాలని డిమాండు చేశారు. దేవస్థానం భూమి శిస్తు పెంపుపై జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కొన్ని బీడు వారిపోయిన భూములు, చౌడు భూములు వ్యవసాయానికి యోగ్యంగా లేవని, శిస్తులు తగ్గించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి కౌలు రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు చె్లుబోయిన కేశవశెట్టి, దేవ రాజేంద్రప్రసాద్‌, రైతు సంఘ నాయకులు చెల్లుబోయిన తాతాజీ పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:08 AM