Share News

అప్పుడే..అధరహో!

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:15 AM

పండుగకు వెళ్లాలి ఎలాగైనా.. ఇదీ ప్రతి ఒక్కరి ఆశ.. ఈ ఆశనే కొందరు క్యాష్‌ చేసు కుంటారు.. ప్రతి ఏడాది ఇంతే.. ఈ ఏడాది జరుగుతున్నది ఇదే.. హైదరాబాద్‌.. బెంగళూరు.. చెన్నై.. పుణె ఇలా ఏ పెద్ద నగరంలోనైనా గోదావరి జిల్లాల వాళ్లు ఉండకుండా ఉండరు.. వీళ్లంతా కుటుంబంతో కలిసి ప్రతి ఏడాది పండుగకు వస్తారు.. స్వగ్రామాల్లో ఆనందంగా గడిపి వెళ్లిపోతారు.. ప్రస్తుతం అక్కడి నుంచి రావడమే గగనంగా మారింది..

అప్పుడే..అధరహో!
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ రైలు

పండుగ బాదుడే..బాదుడు

బస్సులు,రైళ్ల టిక్కెట్ల ధరలు ఫుల్‌

విమాన చార్జీలకు రెక్కలు

హైదరాబాద్‌ నుంచి రూ.7,500

బెంగళూరు నుంచి రూ.8 వేలు

రోజుకు ఆరు ఇండిగో సర్వీసులు

అప్పుడే సగానికిపైగా టికెట్లు ఫుల్‌

బస్సు చార్జీలు పెంచేశారు

ఏసీ స్లీపర్‌ టిక్కెట్లు రూ.3,900

పిండేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌

అన్ని ట్రైన్లలోను రిగ్రెట్‌

గోదావరివాసులకు పండగ షాక్‌

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

పండుగకు వెళ్లాలి ఎలాగైనా.. ఇదీ ప్రతి ఒక్కరి ఆశ.. ఈ ఆశనే కొందరు క్యాష్‌ చేసు కుంటారు.. ప్రతి ఏడాది ఇంతే.. ఈ ఏడాది జరుగుతున్నది ఇదే.. హైదరాబాద్‌.. బెంగళూరు.. చెన్నై.. పుణె ఇలా ఏ పెద్ద నగరంలోనైనా గోదావరి జిల్లాల వాళ్లు ఉండకుండా ఉండరు.. వీళ్లంతా కుటుంబంతో కలిసి ప్రతి ఏడాది పండుగకు వస్తారు.. స్వగ్రామాల్లో ఆనందంగా గడిపి వెళ్లిపోతారు.. ప్రస్తుతం అక్కడి నుంచి రావడమే గగనంగా మారింది.. పండుగకు సుమారు మూడు వారాలున్నా ధరలు పెంచేశారు.. రైళ్లు.. బస్‌లు.. విమానాలు.. ఏవి చూసినా అంతే.. అప్పుడే ధరలు అదరగొట్టేస్తున్నాయి..సంక్రాంతి పండగకు ఊరు రావాలనుకునే వారికి అప్పుడే టికెట్‌ చార్జీలు షాక్‌ కొడుతున్నా యి. విమాన టిక్కెట్ల నుంచి బస్సు, రైలు టికెట్లు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్డగోలుగా రేట్లు పెంచేసి అప్పుడే ఆయా ట్రావెల్స్‌ ప్రయాణికుల జేబులు గుల్ల చేసేస్తున్నాయి. దీంతో ఎక్కడెక్కడి నుంచో పండగకు ఊరొద్దామని ఆశపడే వారికి ప్రయాణం ప్రయాసగా మారిపోయింది. ప్రధానం గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంతోపాటు అనేక పట్టణ ప్రాంతాలకు చెందినవారు వ్యాపార, ఉద్యో గరీత్యా హైదరాబాద్‌లో అధికంగా స్థిరపడ్డారు. బెంగళూరు, చెన్నైతోపాటు అనేక ప్రాంతాల్లోను ఉమ్మడి జిల్లా వాసులు వివిధ అవసరాలరీత్యా ఉంటున్నారు. వీరంతా ఎలాగైనా పెద్ద పండగకు ఊరు రావాల్సిందే. అయితే పండగ దగ్గర పడడం, ఇంకా మూడు వారాలు కూడా లేకపోవడంతో సొంతూరుకు రావడానికి టికెట్లు బుక్‌ చేసుకోవ డానికి ప్రయత్నిస్తే చార్జీలు షాక్‌ కొట్టేస్తున్నాయి. పండగకు రావడమే కాదు.. తిరుగు ప్రయాణం టిక్కెట్లు సైతం అప్పుడే వేలల్లోకి ఎగబాకి చుక్క లు చూపించేస్తున్నాయి. విమానం, రైలు, బస్సు వేటి ధరలు చూసినా బెంబేలెత్తిస్తున్నాయి.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బాదుడు..

పండగకు కాకినాడ, రాజమహేంద్రవరం, కోన సీమ జిల్లాలకు చెందిన అనేకమంది హైదరాబా ద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా స్వ గ్రామాలకు ముందే చేరుకుంటారు. దీంతో అనేక మంది బస్సు టిక్కెట్లకు ప్రయత్నిస్తుంటే చార్జీలు గూబగుయ్‌మనేలా చేస్తున్నాయి. ప్రధానంగా ప్రైవేటు ట్రావెల్స్‌ అయితే చుక్కలు చూపిస్తున్నా యి. సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్‌ బస్సు చార్జీలు హైదరాబాద్‌ నుంచి కాకినాడ, రాజమహేంద్రవ రం, అమలాపురానికి రూ.1,099 నుంచి రూ.1,100 వరకు ఉండగా పండగా పేరుతో ఏకంగా రూ. 3,990 వరకు పిండేస్తున్నాయి. ప్రధానంగా హైద రాబాద్‌ నుంచి కాకినాడ, రాజమహేంద్రవరానికి సుమారుగా 12కిపైగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు రోజుకు 50కిపైగా సర్వీసులు నడుస్తాయి. పండ గకు వీటిని దాదాపు 70 వరకు పెంచాయి. వీటి లో ఇప్పుడు పండగ చార్జీలు రూ.3,200 నుంచి రూ.3,900 వరకు వసూలు చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సాధారణ రోజుల్లో చార్జీలతో పోల్చితే మూడు రెట్లు పెంచేశారు. వాస్తవానికి ఇప్పుడు శీతాకాలం నేపథ్యంలో బస్సుల్లో ఏసీ చార్జీలను తగ్గించాలి. కానీ సంక్రాంతి పండగ పేరుతో అడ్డంగా బాదేస్తున్నాయి. అయితే పండగ దగ్గరపడితే ఈ చార్జీలు రూ.5వేలకుపైగా ఎగబా కినా ఆశ్చర్యపోనవసరంలేదు. మరోపక్క ఈ రూ ట్లో ఆర్టీసీ బస్సులు నాన్‌ఏసీ కేటగిరీలో రూ.770 వరకు వసూలు చేస్తున్నా చాలావరకు సీట్లు నిండిపోయాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్‌ నుంచి కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం పట్టణానికి ఆర్టీసీ వచ్చే నెల 9,10,11,12 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటిలోనూ చాలావరకు సీట్లు నిండిపోయాయి.

ఎగరాలంటే జేబులు గుల్లే..

ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాలకు హైద రాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు ఎక్కువగా జనం వస్తుం టారు. ప్రస్తుతం చాలామంది వేగంగా రావ డం కోసం విమానాలపైనే ఆధారపడుతున్నా రు. తీరా ఇప్పుడు వీటి చార్జీలు ఆకాశాన్నంటే శాయి. ప్రధానంగా వచ్చే నెల 13 నుంచి భోగి పండగ మొదలు కానుంది. ఈ మేరకు ముం దుగానే జనం టిక్కెట్లకు ప్రయత్నిస్తుంటే వేలకు వేలు పిండేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవ రానికి ఇండిగో సంస్థ రోజుకు ఆరుకుపైగా సర్వీసు లు నడుపుతోంది. సాధారణ రోజుల్లో ఫ్లైట్‌ టికెట్‌ ధర రూ.3,999 వరకు ఉంటోంది. కానీ సంక్రాంతి పండగ పేరుతో అప్పుడే ఇండిగో చార్జీలు ఆకాశన్నంటేశాయి. ప్రధానంగా జన వరి 7న హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్ర వరానికి ఫ్లైట్‌ టిక్కెట్‌ ఒకరికి రూ.4,510 ఉంది. జనవరి 8న రూ.5,350, 9న రూ.6,190, 7న రూ.7,135, 8న రూ.5,350, 9న రూ.6,190, 10న రూ.7,135, 11న రూ.7,765 12న రూ. 6,610, 13న రూ.4,510వరకు వసూలు చేస్తోం ది. అయితే పండగకు ఇంకా రెండువా రాలకు పైగా సమయం ఉండడంతో ఇప్పుడే ఈ ధర లు షాక్‌ కొడుతుండగా.. సమయం దగ్గర పడే కొద్దీ ఈ చార్జీలు రూ.14 వేలకుపైగా ఎగబాక నున్నాయి. అటు పండగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే వారికి సైతం చార్జీ లు దడ పుట్టిస్తున్నాయి. ప్రధానంగా జనవరి 16 నుంచి ఏకంగా అప్పుడే టికెట్‌ చార్జీలు రూ. 9,700కు ఎగబాకేశాయి. వ్యవధి దగ్గరపడే కొద్దీ ఛార్జీలు రూ.16 వేలకుపైగా ఉండే అవకాశం ఉంది. అటు బెంగళూరు నుంచి రాజమ హేం ద్రవరం సాధారణ రోజుల్లో ఇండిగో చార్జీలు రూ.3,999 కాగా పండగ పేరుతో అప్పుడే రూ.7,800 వరకు పిండేస్తోంది. ప్రధానంగా ఈ రూట్లో రోజూ నడిచే ఆరు సర్వీసుల్లో వచ్చే జనవరి ఏడవ తేదీన టికెట్‌ చార్జీ రూ.5,983 కాగా 8న రూ.7,095, 9న రూ.7,020, 10న రూ.8,265, 11న రూ.7,851, 12న రూ.7,851 13వ తేదీన రూ.6,412 వరకు ఉంది.

రైళ్లన్నీ రిగ్రెట్‌..

హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం, సామ ర్లకోటకు రోజుకు దాదాపు 17 రైళ్లు నడుస్తుంటా యి. ఎక్కువమంది పండగకు రైళ్లలో రావడానికి ప్రయత్నిస్తారు. కానీ సంక్రాంతి నేపథ్యంలో వీటిలో సీట్లన్నీ నిండిపోవడంతోపాటు ఏకంగా రిగ్రెట్‌ చూపిస్తోంది. ఎన్ని రైళ్లు రద్దీగా ఉన్నా కొంతకాలం కిందట ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్లలో సీట్లు కొంతవరకు ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి. కానీ పండగ రద్దీ నేపథ్యంలో వీటికి కూడా సీట్లు రిగ్రెట్‌ చూపిస్తున్నాయి. ప్రధానంగా వచ్చే నెల 9 నుంచి అయితే అసలు వెయిటింగ్‌ లిస్‌ ్టకాదు కదా అవి కూడా నిండిపోయి రిగ్రెట్‌ దశకు వచ్చేశాయి. విశాఖ ఏసీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి గరీభ్‌ రథ్‌, గోదావరి, ఫలక్‌నుమా, జన్మభూమి, గౌతమి, ఈస్ట్‌కోస్ట్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లన్నీ పూర్తిగా రద్దీగా మారి రిగ్రెట్‌ చూపిస్తున్నాయి. దీంతో జనం సొం తూళ్లకు రావడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. విమానాల దగ్గర నుంచి బస్సులు, రైళ్లు ఎక్కడికక్కడ సీట్లన్నీ అప్పుడే ఫుల్‌ అయిపోయా యి. అటు దగ్గరచేసి తత్కాల్‌లో టికెట్లు తీసుకుం దామన్నా బాదుడు మామూలుగా లేదు. దీంతో చాలామందికి దిక్కుతోచడం లేదు.

Updated Date - Dec 26 , 2024 | 12:15 AM