Share News

అత్యధిక మెజార్టీతో చరిత్ర సృష్టించాం

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:48 AM

రాజమహేంద్రవరంలో 71వేల పైచీలుక మెజార్టీతో సరికొత్త చరిత్రను సృష్టించామని నూతన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం స్థానిక తిలక్‌రోడ్డులోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అత్యధిక మెజార్టీతో చరిత్ర సృష్టించాం

ఇది ప్రజావిజయం మా నేతలకు అంకితం

నగర అభివృద్ధికి కార్యచరణ చేపట్టాం

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విజేత ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 5: రాజమహేంద్రవరంలో 71వేల పైచీలుక మెజార్టీతో సరికొత్త చరిత్రను సృష్టించామని నూతన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం స్థానిక తిలక్‌రోడ్డులోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో తాను ఇంత ఘనవిజయాన్ని అందుకున్నానని అన్నారు. అందుకు కారకులైన వారికి, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆది నుంచి తనపై తప్పుడుగా ట్రోల్‌ చేసిన వైపీపీ పేటిఏం వారికి చెబుతున్నా, ఎమి చేసుకుంటారో చేసుకోండని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కొట్టిన దెబ్బకు గూబగుయ్యీమందన్నారు. తాను సాధించింది ప్రజా విజయమన్నారు. ఈ విజయాన్ని కూటమీ నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, మోదీలకు అంకితమిస్తున్నానని చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తమను ఇబ్బందులు పెట్టారని తన భార్యను అసెంబ్లీలో చాలా అవమా నించారని గుర్తుచేశారు. రెండునెలల కంటిమీద నిద్ర లేకుండా చేశారని చివరికి తమను ప్రలోభాలకు గురిచేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించక అక్రమ కేసులో తనను, తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును జైలులో పెట్టారని గుర్తుచేశారు. వైసీపీ చాలా చిల్లర రాజకీయాలు చేసిందన్నారు. మేము ధృడసంకల్పంతో ఉన్నామని ప్రాణాలు ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటామన్నారు. రాజమహేంద్రవరం ప్రజలకు ఎదైతే హామీలు ఇచ్చామో, నగర అభివృద్ధికి లోకల్‌ మేనిఫెస్టో తయారు చేశామో వాటిని నెరవేరుస్తామన్నారు. తాను గెలిచిన వెంటనే కార్యాచరణ కూడా సిద్ధం చేసి పనులు మొదలు పెట్టానని చెప్పారు. నగర అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక తన వద్ద ఉందన్నారు. ఈ సమావేశంలో జనసేన ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నగర ఇన్‌చార్జి యెనుముల రంగబాబు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, మురుకుర్తి రవియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ పురందేశ్వరిని కలిసిన ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 5: రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని రూరల్‌, సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్‌లు మర్యాపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా శాలువాతో ఆమెను సత్కరించారు. వారిని కూడా పురందేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు. వారితో పాటు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన కూటమి నాయకులు పురందేశ్వరి కలిసి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు.

ఫ రాజమహేంద్రవరం ఎంపి , సిటీ, రూరల్‌ నియోజకవర్గాల నుంచి కూ టమి ఎమ్మెల్యేలుగా భారీ మెజార్టీతో విజయం సాధించిన దగ్గుబాటి పురందేశ్వరి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్‌లను కలిసేందుకు నాయకులు , పలువురు అధికారులు, కార్యకర్తలు అభిమానులు కార్యాలయాలకు తరలివస్తున్నారు. ప్రత్యేకంగా అభినందలు తెలుపుతున్నారు. పలు శాఖలకు చెందిన అధికారులు కూడా ఎమ్మెల్యేలను కలిసి అభినందనలు తెలుపుతున్నారు. దీంతో అటు గోరంట్ల నివాసం వద్ద, ఇటు ఆదిరెడ్డి నివాసం వద్ద , ఎం పి నివాసం వద్ద భారీగా కార్లు, బైక్‌లలతో రహదార్లు జామ్‌అవుతున్నాయి.

మొక్కులు తీర్చుకున్న తెలుగు మహిళలు

కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు అత్యధిక మెజార్టీ రావాలని చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్న తెలుగు మహిళలు వాటిని తీర్చుకున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో తోట వీధిలో గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. 108 మంది ముత్తైదువులు 108 బిందేలతో గణపతికి జలాభిషేకం చేశారు. . కార్యక్రమంలో తెలుగు మహిళ నాయకులు తురకల నిర్మల, మీసాల నాగమణి, అంగన్‌వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరీ, ఆదిలక్ష్మి, కోన సత్య, నాగలక్ష్మి, చంద్రకళ, కృష్ణవేణి, నాగలక్ష్మి, వీరవేణి, సూర్యకుమారి, జయ, భాను, సత్య, ఈశ్వరి, మహాలక్ష్మి డివిజన్‌ గౌరవ అధ్యక్షుడు పల్లా సత్యనారాయణ, కార్యదర్శి వీరా రాము, రొక్కం మల్లేష్‌, పేరిశెట్టి సత్తిబాబు, కరాటి బాలా తదితరులు పాల్గొన్నారు.

3వ డివిజన్‌లో ఇంటింట స్వీట్లు పంచిన కుడుపూడి

ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ను సీటీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీలో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక 3వ డివిజన్‌లో టీడీపీ శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు ఇంటింకీ స్వీట్లు పంచారు. డివిజన్‌లో విజయోత్సవ సంబరాలు చేశారు. 100 కేజీలు స్వీట్లు పంచారు. చంద్రబాబు సీఎం కావడంతో రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన జనసేన నేత అనుశ్రీ

జిల్లాలో నూతనంగా ఎన్నికైన కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలను రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ జనసేన ఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి, సీటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణుడులను కలిసి వారిని సత్కరించి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అనుశ్రీ సత్యనారాయణకు ఆయన కార్యవర్గానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట జనసేన ఉపాధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీబాబు, సీటీ కార్యదర్శులు గుణ్ణం శ్యామ్‌సుందర్‌, అల్లాటి రాజు, విన్నా వాసు, సంయుక్త కార్యదర్శి వట్టికుటి వేణుగోపాల్‌ కృష్ణ ,ఇంద్ర విజయ్‌ తదితరులు ఉన్నారు.

విజేతలకు అభినందనలు

కడియం, జూన్‌ 5: రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థినిగా ఘన విజయం సాధించిన దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరిలను నర్సరీ సంఘం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నర్సరీ సంఘం అధ్యక్షుడు మల్లు పోలరాజు, ఉపాధ్యక్షుడు పెనుమాక కొండబాబు, సెక్రటరీ గాద నాగేశ్వరరావు, ట్రెజరర్‌ తాడాల బాలమురళి, పీఆర్‌వో గరగ నాగేశ్వరరావు, డైరెక్టర్లు గాజుల రత్తయ్య, తాడాల నాగేశ్వరరావు, కొండేపూడి నాగు, కోఆప్షన్‌ మెంబర్‌ రాజేష్‌ ఉన్నారు.

ఫగోరంట్ల బుచ్చయ్యచౌదరిని టీడీపీ-జనసేన నాయకులు కలిసి భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియపులంక మాజీ సర్పంచ్‌ గట్టి నర్సయ్య, వేమగిరి మాజీ సర్సంచ్‌ డా. వెలుగుబంటి వెంకటాచలం(నాని), వైస్‌ ఎంపీపీ పంతం గణపతి, నర్సరీరైతులు గట్టి సుబ్బారావు, మల్లు శివన్నారాయణ తదితరులు ఉన్నారు.

ఎంపీ పురందేశ్వరిని కలిసిన జనసేన నాయకులు

దివాన్‌చెరువు, జూన్‌ 5: బీజేపీ, టీడీపీ జనసేన కూటమి రాజమహేంద్రవ రం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని రాజానగరం మండల జనసేన నాయకులు పేపకాయల విష్ణుమూర్తి, దేశాలశ్రీను, ద్వారంపూడి నాగమునేశ్వరరావు, ఎంవీ కృష్ణప్రసాద్‌ మర్యాదపూర్వకంగా బుధవారం కలసి శుభాకాంక్షలు తెలిపారు

నల్లమిల్లి నివాసానికి పోటెత్తిన అభిమానులు

అనపర్తి, జూన్‌ 5 : అనపర్తి ఎమ్మెల్యేగా రెండవ సారి విజయం సాధించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు బుధవారం ఆయన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పోటెత్తారు. అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ తాడి రామగుర్రెడ్డి ఆధ్వ ర్యంలో వైద్య సిబ్బంది ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజక వర్గంలోని వివిధ గ్రామాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, డ్వా క్రా యానిమేటర్లు తరలివచ్చి నల్లమిల్లిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

రామకృష్ణారెడ్డిని అభినందించిన టీడీపీ నేతలు

బిక్కవోలు, జూన్‌ 5: కూటమి అభ్యర్ధిగా ఎన్నికైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం బిక్కవోలుకు చెందిన దేశం నేతలు కలసి అభినందించారు. అభినందించిన వారిలో మండల మాజీ అధ్యక్షుడు పల్లి వాసు, గ్రామశాఖ అధ్యక్షుడు పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, గొర్రెల త్రిమూర్తులు, రాయుడు రామచంద్రరావు, సింగారపు రామారావు వున్నారు.

రంగంపేట, జూన్‌ 5: అనపర్తి ఎమ్మెల్యేగా విజయదుంధిబీ మోగించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్‌, ఆళ్ళ బాబి, ఆళ్ళ రామకృష్ణ, రంగంపేట మండల నాయకులు వెలుగుబం టి.సత్తిబాబు, నీలపాల త్రిమూర్తులు, ఉద్దం డ్రావు శ్రీను, మాచిన వెంకన్నదొర, నిమ్మలపూడి కాటన్‌దొర, మోదుకూరి గోపాలకృష్ణ, ఇతర నాయకులు, మండల విద్యా శాఖాధికాలు కె.శ్రీనివాసరావు, పి.మధుసూధనరావు, జేఈ కె.శ్రీనివాసరావు, ఆయా శాఖాధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దుస్సాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.

కూటమి నాయకులు సంబరాలు

గోకవరం, జూన్‌5: జగ్గంపేట కూటమి అభ్యర్ధిగా జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంట్‌ కూటమి అభ్యర్ధిగా తంగెళ్ళ ఉదయశ్రీనివాస్‌ విజయానికి సహ కరించిన ప్రతీఒక్కరికీ గోకవరం కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గోకవరంలోని టీడీపీ సీనియర్‌ నాయకుడు బత్తుల సత్తిబాబు స్వగృహంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేసంలో కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీకి 164 సీట్లు, పార్లమెంట్‌కు 21 సీట్లు కూటమి అభ్యర్ధులను గెలిపించిన ప్రజానీకానికి పాదాభివంద నాలన్నారు. అనంతరం భారీ కేక్‌ను కట్‌ చేయడంతోపాటు, మిఠా యిలు పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో కూటమి నాయకులు మంగరౌతు రాము, పాలూరి బోస్‌, బత్తుల సత్తిబాబు, దాసరి తమ్మన్నదొర, గాజింగం సత్తిబాబు, మట్టా మంగరాజు, పదిలం మురళి, ప్రగడ ప్రభ, మండిగ గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆ రెండు గ్రామాలు చరిత్రను తిరగరాశాయి

గోకవరం, జూన్‌ 5: ఎన్నికల ఫలితాల్లో జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలంలో రెండు గ్రామాల్లో ఎన్నికల ఫలితాలు చరిత్రను తిరగరాశాయి టీడీపీ ఆవిర్భావం నుంచి ఏ ఎన్నికల్లోనూ ఎపుడూ ఆపార్టీకి మెజార్టీ రాని ఆ రెండు గ్రామాల్లో ఈసారి జరిగిన ఎన్నికల్లో మెజార్టీని కైవసం చేసుకున్నాయి. అచ్చుతాపురం, గాదెలపాలెం గ్రామాల్లో ఈవిశేషం చోటు చేసుకోవడం విశేషం. అచ్చుతాపురంలో తమ సమీప ప్రత్యర్ధి పార్టీ వైసీపీపై 212 ఓట్లు టీడీపీ మెజార్టీ సాధించగా, గాదెల పాలెంలో టీడీపీకి 87 ఓట్లు ఆధిక్యంగా వచ్చాయి. అలాగే గోకవరం మండలంలో ఉన్న ప్రతీ గ్రామం టీడీపీయే పైచేయి సాధించింది.

సీతానగరం, జూన్‌ 5: రాజానగరం నియోజక వర్గంలో కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపోందడంతో కూటమి నాయకులు ,కార్యకర్తలు సంబ రాలలో మునిగి తేలారు. మండలంలోని పురుషోత్తపట్నం, రామచంద్రపురం గ్రామాలలో భోజనాలు ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకున్నారు

తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 08:25 AM