Share News

టూరిజం హబ్‌గా రాజమహేంద్రవరం

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:18 AM

రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరానికి పర్యాటక మహర్దశ పడుతుందన్నారు. రాష్ట్ర పర్యాటక శా ఖ మంత్రి దుర్గేష్‌ సహకారంతో ఇప్పటికే టెంపుల్‌ టూరిజం ప్రత్యేక సర్వీసులు ప్రారంభించామన్నా రు.

టూరిజం హబ్‌గా రాజమహేంద్రవరం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

  • హేవ్‌లాక్‌కు పర్యాటక శోభ తెస్తాం

  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 2( ఆం ధ్రజ్యోతి): రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరానికి పర్యాటక మహర్దశ పడుతుందన్నారు. రాష్ట్ర పర్యాటక శా ఖ మంత్రి దుర్గేష్‌ సహకారంతో ఇప్పటికే టెంపుల్‌ టూరిజం ప్రత్యేక సర్వీసులు ప్రారంభించామన్నా రు. గోదావరి నదిపై మూడు కిలోమీటర్ల పొడవున్న హెవ్‌లాక్‌ బ్రిడ్జికి పర్యటక శోభ తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మం త్రి దుర్గేష్‌ కృషి చేస్తున్నారని, కేంద్రమంత్రి షెరావత్‌తో మాట్లాడారని చెప్పారు. హెవ్‌లాక్‌ బ్రిడ్జి పర్యాటక అభివృధ్దికి నిధులు కేటాయింపజేశారని చెప్పారు. గోదావరి లంకల్లో రిసార్ట్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కరాలకు ఇప్పటి నుంచే అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈనెల 12న ఢిల్లీకి ఎయిర్‌ బస్‌ సర్వీస్‌లు ప్రారంభమౌతాయని, అలాగే షిర్డీ, తిరుపతికి సర్వీసులు మొ దలవుతాయని, దేశంలో ముఖ్యపట్టణాల నుంచి విమాన సర్వీసులు రాజమహేంద్రవరానికి తిప్ప డం ద్వారా ఇక్కడ పర్యాటక ఆదాయంతో పాటు ఉపాది అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, జనసేన ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, యిన్నమూరి దీపు, నక్కా దేవి వరప్రసాద్‌, బుడ్డిగ రాధ, శెట్టి జగదీష్‌, బుడ్డిగ రవి, నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవిందు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:18 AM