Share News

త్రిశూల వ్యూహంతో ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - May 02 , 2024 | 01:40 AM

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ త్రిశూల వ్యూహంతో ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.

త్రిశూల వ్యూహంతో ఎన్నికల ప్రచారం

కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ

కోరుకొండ, మే1: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ త్రిశూల వ్యూహంతో ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. బుధవారం కోరుకొండ మండలం గుమ్ముళూరు గ్రామంలో, సీతానగరం మండలం ముగ్గళ్ళ, రఘుదేవపురం గ్రామాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజానగరం మండలం స్వరూపనగర్‌, రూపనగర్‌ గ్రామాల్లో కూడా ఎన్నికల ప్రచారం చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గ శాసన సభ స్ధానం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

బత్తులకు మద్దతుగా బీవీఆర్‌ చౌదరి, చిట్టూరి ప్రచారం

రాజానగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు మద్దతుగా టీడీపీ ఇన్‌చార్జ్‌ బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, ముగ్గళ్ల గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మివెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నా సేన కోసం నా వంతు కో ఆర్డినేటర్‌ బత్తుల వెంకటలక్ష్మి, టీడీపీ ఇన్‌చార్జ్‌ బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్రలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

ఫ గుమ్ముళూరులోబత్తుల బలరామకృష్ణ కుమార్తె బత్తుల వందనాంబిక, సోదరుడు బత్తుల గోపాలకృష్ణ ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లు మంగళవారం విడుదలచేసిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు.

ఫ రాజానగరం నియోజకవర్గానికి చెందిన కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల ఇతర పార్టీలకు చెందిన పలువురు కూటమి అభ్యర్థి బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంవద్ద జనసేనపార్టీలోకి చేరారు.

ఫ కూటమి అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణను గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ, జనసేన,బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణకు, ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి, కుమార్తెలు తోట ప్రత్యూషదేవి, అల్లుడు తోట పవన్‌కుమార్‌, మరో కుమార్తె బత్తుల వందనాంబికకు ప్రచారంలో జనంమంగళ నీరాజనాలు అందించి ఆశీర్వదిస్తున్నారు.

రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా

39వ డివిజన్‌ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 1: కూటమి అధికారంలోకి వస్తే రాజమహేంద్రవరాన్ని అన్నిరంగాల్లోను అభివృద్ధి పథంలో నడిపిస్తానని సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం 39వ డివిజన్‌లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా స్థానిక మహిళలు పెద్దఎత్తున హారతులతో భారీ స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అనంతరం ఆయన ఇంటింటికీ ఉమ్మడి మెనిఫెస్టోలోని అంశాల కరపత్రాలను, లోకల్‌ మేనిఫెస్టోలోని అంశాల కరపత్రాలను మహిళకు, యువతకు, వృద్ధులకు అందించారు. కూటమిని అఽధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తనను ఎమ్మెల్యేగా సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓట్లువేసి గెలిపించాలన్నారు. తానను గెలిపిస్తే రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుతానని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని, ఐటీ హబ్‌ ఏర్పాటు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన పారిశుధ్యం, నిరంతరం సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. చెత్త పన్ను రద్దుచేయిస్తామన్నారు. టీడీపీ నాయకులు యాళ్ళ ప్రదీప్‌, గొర్రెల సత్యరమణి పాల్గొన్నారు.

చంద్రబాబు, పవన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో అద్బుతమైన ఉమ్మడి మెనిఫెస్టోను రూపొందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లకు యువత దన్యవాదాలు తెలుపుతూ వారి పెక్సీలకు పాలాభిషేకం చేశారు. స్ధానిక తిలక్‌రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉె్ముడి అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో నక్కాదేవివరప్రసాద్‌, యాళ్ళ పదీప్‌ పాల్గొన్నారు.

కూటమికి మద్దతు ప్రకటించిన కాపు సంఘీయులు

కాపు సంఘీయులంతా కూటమిని గెలిపించుకుంటామని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాజమహేంద్రవరం జాంపేట ఉమారామలింగేశ్వరస్వామి కళ్యాణ మండపంలో కాపు సంఘీయుల ఆత్మీయ సమావేశం బుధవారంరాత్రి కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు రామినీడు మురళీ అధ్యక్షతన జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు లు ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపు నాయకులు మాట్లాడుతూ కాపులు చాలా ఇబ్బందులు పడ్డారని ఈ ఎన్నికల్లో కాపులు కూటమిని గెలిస్తారని చెప్పారు. సమాజసేవ కోసం ముందుకు వచ్చిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఇబ్బందులకు గురిచేశారని, ప్రజలు చాలా సమస్యలతో ఉన్నారని అందువలన కూటమిని గెలిపించుకుంటే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా పేదలకు ఆదుకుంటామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పిస్తామన్నారు. టీడీపీ-జనసేన కలయికకు రాజమహేంద్రవరం వేదిక అయ్యిందని ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. కూటమితో కాపులకు న్యాయం చేస్తామని దగ్గుబాటి అన్నారు. అనంతరం కాపు సంఘీయ నాయకులు దొండపాటి సత్యంబాబు, కాపు సంఘం అధ్యక్షుడు అల్లూరి శేషు నారాయణ, చింతం వీరబాబు, వై శ్రీను, కాపునాడు జిల్లా అధ్యక్షుడు గుదే రఘునరేష్‌ ముమ్మిడి వీరబాబు, కాపు నాయకులు యెనుముల రంగబాబు, కుచ్చు శ్రీనివాస్‌, సిహెచ్‌ శ్రీనివాస్‌, నాగిరెడ్డి సుబ్బారావు, బీవీ రాఘవులు, రొక్కం అప్పారావు, మాలే విజయలక్ష్మి, ఆకుల వెంకటేశ్వరరావు ,ఆకుల షణ్ముఖరావు లు మాట్లాడారు.

మీ ఆదరాభిమానంతో విజయాన్ని అందించాలి

దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల రోడ్‌షో

కడియం/రాజమహేంద్రవరంరూరల్‌, మే 1: జూన్‌ 4న జరిగే ఎన్నికల ఫలితాల్లో అనూహ్య విజయాన్ని అందించాలని మీరంతా ఎంతో ఆదరాభిమానం చూపుతున్నారనే విషయం తనకు రోడ్‌షో ద్వారా స్పష్టమవుతుందని ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. బుధవారం కడియం మండలంలో ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీష రోడ్‌షో నిర్వహించారు. కడియంలో ఎంపీపీ, రాష్ట్ర నాయకులు వెలుగుబంటి ప్రసాద్‌ కార్యాలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షో కడియంలో పంచాయతీ వీధి, దళితవాడ, వినాయక ఆలయంవీధి, దేవీచౌక్‌ సెంటర్‌, భాస్కరనగర్‌ తదితర ప్రాంతాల్లో జరిగింది. కడియంలో వినాయక ఆలయంవద్ద పలువురు బీజేపీలో చేరారు. స్థానిక దళితవాడలో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భాస్కర్‌నగర్‌ సెంటర్‌లో కడియపుసావరం గ్రామానికి చెందిన బీజేపీ జనసేన, టీడీపీ నాయకులు క్రేన్‌ సహాయంతో భారీ గజమాలవేసి పూలవర్షం కురిపించారు. అనంతరం జేగురుపాడు గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు. గ్రామంలో డా. బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాధవరాయుడుపాలెం రోడ్‌షో చేరుకుంది. గ్రామ సర్పంచ్‌, టీడీపీ రాష్ట్ర నాయకులు అన్నందేవుల చంటి, మాజీ ఎంపీపీ అన్నం దేవుల విజయలు ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామికి పూజలు చేశారు. చంటి, విజయ దంపతులు దగ్గుబాటి పురందేశ్వరికి, గోరంట్ల కుమార్తె కంఠమనేని శిరీషలకు తమ ఇంటి ఆడబడుచుల మాదిరిగా తలచి చీరలను అందజేశారు. ఓం శాంతి సభ్యులు హారతి ఇచ్చి దీవెనలు అందజేశారు. అనంతరం రోడ్‌షో గుబ్బలవారిపాలెం మీదుగా మురమండ చేరుకుంది. అనంతరం దుళ్ళ గ్రామం రోడ్‌షో చేరుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వెలుగుబంటి ప్రసాద్‌, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, గారపాటి అమరనాద్‌, వెలుగుబంటి నాని, ఆకుల శ్రీదర్‌, బొర్సు సుబ్రహ్మణ్యం, గెడ్డం శివ, ముద్రగడ జమీ, గట్టి నర్సయ్య, నాగిరెడ్డి రామకృష్ణ, పంతం గణపతి, వరగోగుల వెంకటేశ్వరరావు, ప్రత్తిపాటి రామారావుచౌదరి, దేవళ్ళ రామ్మోహనరావు, వరగోగుల సత్యనారాయణ, పాటంశెట్టి రాంజీ, కర్రి చినబాబు, తదితరులు పాల్గొన్నారు. దామిరెడ్డిపల్లి, కడియపులంక, బుర్రిలంక గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు.

పురందేశ్వరికి తులాభారం

బీజేపీ,తెలుగుదేశం,జనసేన కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరికి కడియం మండలం కడియపులంకలో ముసలమ్మ ఆలయంవద్ద బుధవారం తులాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 కిలోల బెల్లంతో పురందేశ్వరికి తులాభారం చేసి పూల కిరీటాన్ని తలపై పెట్టారు. ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో పురందేశ్వరి ఎంపీగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ తులాభారాన్ని నిర్వహించామని నాయకులు తెలిపారు. ముందుగా పురందేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్యచౌదరిలు అమ్మవారికి పూజలు చేశారు.

రాష్ట్రాభివృద్ధి ఎన్డీయే కూటమితోనే సాధ్యం

ఎన్డీయే కూటమి అభ్యర్థి నల్లమిల్లి తరపున ప్రచారం

అనపర్తి, మే 1 : రాష్ట్రాభివృద్ది, సంక్షేమం, యువత భవిత, మహిళ రక్షణ ఎన్డీయే కూటమితో ఏర్పడే ప్రభుత్వానికే సాధ్యపడుతుందన్న నినాదంతో అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం కోరుతూ ఓవైపు ఆయన కుటుంబ సభ్యులు మరో వైపు పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధ వారం అనపర్తి శివారు కొత్తూరులో నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ కమలం గుర్తుకు ఓట్లు వేసి పార్లమెంట్‌ అభ్యర్ధి పురందేశ్వరి, అసెంబ్లీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిల ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఆమె వెంట మహాశక్తి మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో నల్లమిల్లి తనయ డాక్టర్‌ సనాతని ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టోలో అంశాలను వివరిస్తూ కమలం గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. ఆమె వెంట నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు జుత్తుగ సూర్యకుమారి ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా బిక్కవోలు మండలం మెళ్ళూరు గ్రామంలో రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బిక్కవోలు మాజీ జెడ్పీటీసీ పడాల వెంకటరామారెడ్డి కూటమి అభ్యర్దులు పురందేశ్వరి, రామకృష్ణారెడ్డిల విజయం కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పడాలకు గ్రామస్థుల నుండి విశేష ఆదరణ లభించింది. అవినీతి ప్రభుత్వాని గద్దె దించాలని లేకుంటే భవిష్యత్‌ తరాల వారు భవిష్యత్‌ లేకుండా పోతుందని అన్నారు.

మండపేట బహిరంగ సభలో జనసేనానితో రామకృష్ణారెడ్డి

మండపేటలో బుదవారం జరిగిన జనసేన అదినేత పవన్‌కళ్యాణ్‌ సభలో అనపర్తి ఎన్డీయే కూటమి బీజెపీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పవన్‌ బహిరంగ సభకు అనపర్తి నియోజకకవర్గం నలుమూలల నుండి పవన్‌, జనసేన అభిమానులు భారీగా తరలివెళ్ళారు. ఈ సందర్బంగా జరిగిన సభలో జనసైనికులు, తన అభిమానులు అనపర్తి నియోజకవర్గ జనసైనికులు నల్లమిల్లికి మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అదే విదంగా జనసేనాని పలుమార్లు తన ప్రసంగంలో నల్లమిల్లి ప్రస్థావన తీసుకురావడంతో అనపర్తి జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 02 , 2024 | 01:40 AM