తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Aug 16 , 2024 | 11:57 PM
తుని రూరల్, ఆగస్టు 16: రాబోయే ఐదేళ్లలో కోట్లలో నిధులు ఖర్చు చేసి తుని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టంచేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన నియోజకవర్గంలో గల పా ఠశాలల అభివృద్ధి కమిటీ
శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల
తుని రూరల్, ఆగస్టు 16: రాబోయే ఐదేళ్లలో కోట్లలో నిధులు ఖర్చు చేసి తుని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టంచేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన నియోజకవర్గంలో గల పా ఠశాలల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఎన్‌ఆర్‌జీ ఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌లు, ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం తునిలో జరగగా వారిద్దరూ మాట్లాడుతూ ఇప్పటికే తునిలో రూ.10 కోట్లు ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో అభివృద్ధి పనుల రూపకల్పన జరుగుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. కూ టమి ప్రభుత్వం రాకతో తునిలో అరాచకపాలన నశించి ప్రశాంత వాతావరణం ఏర్పడిందన్నారు. పాఠశాల కమిటీలు విద్యాలయాల అభివృద్ధి, విద్యార్థుల ఉన్నతికి కృషిచేయాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాలని, పాఠశాల అభివృద్ధి అవసరాలను తమ దృ ష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని సూచించారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, టీడీపీ నేత యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనీడి నాగ సోమరాజు, ఇనుగంటి సత్యనారాయణ, గా డి రాజబాబు కోడా వెంకటరమణ పాల్గొన్నారు.