వైసీపీ పాలనలో అభివృద్ధి దూరం
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:57 PM
తొండంగి, మార్చి 22: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభి వృద్ధి ఆమడ దూరంలో ఉందని తుని టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య అన్నారు. శుక్రవారం రావికంపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యా రంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ హయాంలో ప్రజలకు సంక్షేమ పాలన అం
తొండంగి, మార్చి 22: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభి వృద్ధి ఆమడ దూరంలో ఉందని తుని టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య అన్నారు. శుక్రవారం రావికంపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యా రంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ హయాంలో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తే వైసీపీ పాలనలో సంక్షోభ పాలన అందుతోందన్నారు. పేదల కోసం టీడీపీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు తదితర సూపర్‌సిక్స్ పథకాలను ప్రకటించిందన్నారు. మెరుగైన పాలన కోసం తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు యనమల నాగేశ్వర్రావు, యనమల కృష్ణ, యనమల రాజేష్, చొక్కా అప్పారావు, మోతుకూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, చింతంనీడి అబ్బా యి, చిరంజీవిరాజు, రాంబాబు రాజు, అరిగెల నర్శింహమూ ర్తి, సిద్ధాం రాంబాబు, వెల్నాటి భరత్, పోసిన నందిబాబు, చోడిశెట్టి గణేష్, కోడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.