12 డైరెక్టర్ పదవులకు 66 నామినేషన్లు
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:48 AM
ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికలు రసవత్తంగా మార నున్నాయి. 12 డైరెక్టర్ పదవులకు గురువారం ఏకంగా 66 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
రాజమహేంద్రవరం, జూలై11(ఆంధ్రజ్యోతి) : ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికలు రసవత్తంగా మార నున్నాయి. 12 డైరెక్టర్ పదవులకు గురువారం ఏకంగా 66 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ కూటమి ప్యానల్ చైర్మన్ అభ్యర్థిగా చల్లా శంకరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ప్యానల్‌కు ఎంపికైన మిగతా 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ మద్దతుదార్లుగా అనేక మంది ఇష్టానుసారం నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. మొత్తం ఆర్యాపురం బ్యాంక్ పరిధిని మూడు నియోజకవ ర్గాలుగా విభజించారు. ఒకటో నియోజకవర్గంలో ఆర్యాపురం మెయిన్ బ్రాంచి, కోటగుమ్మం, తాడితోడ, కాతేరు, స్వరాజ్యనగర్,జెఎన్‌రోడ్, బొమ్మూరు, దానవా యిపేట బ్రాంచిలు ఉంటాయి. వీటి పరిధిలో ఓటర్లు 10 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు.ఈ నియోజ కవర్గంలో 10 డైరెక్టర్ పదవులకు 62 మంది నామి నేషన్లు దాఖలు చేశారు. రెండో నియోజకవర్గం కింద కాకినాడ,తాడేపల్లిగూడెం, తణుకు బ్రాంచిల పరిధిలో ఒక డైరెక్టర్ పదవి ఉంది. నడకుదురుకు చెందిన సిం గంపల్లి వెంకట రామకృష్ణ ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైంది. 13వ తేదీన అధికారికంగా ప్రకటిస్తారు. మూడో నియోజకవర్గం కింద దివాన్ చెరువు, భీమవరం, అమలాపురం, వైజాగ్( సీతమ్మధా ర), గుంటూరు బ్రాంచిల పరిధిలో ఒక డైరెక్టరును ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీడీపీ కూటమి ప్యానల్‌కు చెందిన దివాన్‌చెరువు వాసి నీలపాలన సూర్యసత్య నారాయణతో పాటు దివాన్‌చెరువుకు చెందిన మరొ కరు, అమలాపురానికి చెందిన ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన తర్వాత 13 ఉపసంహరణ గడువు ఇస్తారు.అదేరోజు ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే 20న పోలింగ్ జరగే అవకాశం ఉంది. టీడీపీ కూటమి ప్యానల్‌తో పాటు వైసీపీ కూడా ప్యానల్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. రెండు డైరెక్టర్ పదవులకు సీపీఐ నుంచి జిల్లా సహాయ కార్యదర్శి కూండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.