Share News

గ్రంథాలయాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:54 AM

గ్రంథాలయాలను వినియోగించుకుని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రంథాలయాధికారి జీవీవీఎన్‌ త్రినాథ్‌ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం కొవ్వూరు ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.

 గ్రంథాలయాలను వినియోగించుకోవాలి
కొవ్వూరులో మాట్లాడుతున్న ఉదయశ్రీ

  • అయ్యంకి, గాడిచర్ల, పాతూరిలకు ఘనంగా నివాళులు

  • విద్యార్థులకు పాటలు, వక్తృత్వ పోటీలు

కొవ్వూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాలను వినియోగించుకుని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రంథాలయాధికారి జీవీవీఎన్‌ త్రినాథ్‌ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం కొవ్వూరు ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. దీనికి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల లైబ్రేరియన్‌ జె.ఉదయశ్రీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయ ఉద్యమం కీలకపాత్ర పోషించిందన్నారు. దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు స్థాపించుటకు కృషిచేసి అయ్యంకి వెంకటరమణయ్య గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరుగాంచారన్నారు. డాక్టర్‌ ఎస్‌ఆర్‌ రంగనాథన్‌ గ్రం థాలయ పంచసూత్రాలను రూపొందించారని, పా తూరి నాగభూషణం చిన్నతనం నుంచి గ్రంథాలయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కృషి చేశారన్నారు. అనంతరం విద్యార్థులకు దేశభక్తి గీతా లు, లలితగీతాలు, జానపద గీతాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన 110 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:54 AM