వాడపల్లి ఆలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:30 AM
వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది.
ఆత్రేయపురం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తు లు స్వామివారికి అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒకరోజు ఆదాయం రూ.3,35,939 వచ్చినట్టు ఉప కమిషనర్, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలి పారు. సాయంత్రం జరిగిన కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.