వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:15 AM
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలంకరణ, సుంగధ పరిమళాలు వెదజల్లే వేద పండితుల మంత్రోచ్ఛరణ, కళాకారుల ప్రదర్శనలు, భక్తజన గోవిందనామస్మరణల నడుమ వాడపల్లి పులకించిం ది.
ఆత్రేయపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలంకరణ, సుంగధ పరిమళాలు వెదజల్లే వేద పండితుల మంత్రోచ్ఛరణ, కళాకారుల ప్రదర్శనలు, భక్తజన గోవిందనామస్మరణల నడుమ వాడపల్లి పులకించిం ది. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం తొలిరోజు బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు- కమలరాణి చేతులు మీదుగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేదపండితులు, అర్చక బృందం, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వస్తివచనము, విశ్వక్సేనపూజ, పుణ్యహవచనము, దీక్షాధారణ, కల్మసహోమము, అగ్ని ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలను రమణీయంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాల తో అలంకరించిన వసంత మండపంలో స్వామివారు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు- కమలరాణి దంపతులు ఉప కమిషనరు నల్లం సూర్యచక్రధరరావు-కనకదుర్గాదేవి దంపతులు పూజా మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించి అంకుర్పారణ చేశారు. ధ్వజపీఠం వద్ద వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ప్రకార మండపం, ఆలవార్ల మండపంలో పుష్పాలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. విద్యు ద్దీపాలంకరణలు భక్తులను మంత్రముగ్దులను చేశాయి. పుష్పాలతో అలంకరించిన వేంకటేశ్వరస్వామి, తిరునామాలతో ఫొటోషూట్‌లు నిర్వహించారు. అనంతరం రాత్రి యాగశాలలో హోమాలు నిర్వహించారు. ధ్వజస్తంభం బలిపీఠం వద్ద ఉత్సవమూర్తులు కొలువుతీరారు. ధ్వజపటాన్ని ఊరేగిస్తూ దేవతలను ఆహ్వానించారు. ధ్వజస్తంభంలో ప్రతిష్టించిన గరుడికి పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకు ర్పారణ చేశారు. కేరళ, తెలంగాణకు చెందిన వాయిద్య కళాకారుల ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. అనంతరం రాత్రి శ్రీవారు పరా వాసుదేవ అలంకరణలో అలంకృతుడై శేషవాహనంపై కొలువుతీరారు. విద్యుత్ వెలుగులు, మేళతాళ మంగళవాయిద్యాలు, వేదఘోష, బాణసంచా కాల్పుల నడుమ శ్రీవారు తిరుమాడవీఽథులలో అశేష భక్తజన గోవిందనామస్మరణ నడుమ విహరించారు. అశేష భక్తజనం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తన్మయత్వం పొం దారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ముదునూరి వెంకట్రాజు- సత్యశ్రావణి దంపతులు, సర్పంచ్ కాయల జగన్నాఽథం, పలువురు ప్రముఖులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
నేడు వాడపల్లిలో....
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, సరస్వతి అలంకరణలో హంస వాహనంపై శ్రీవారి వాహన సేవ నిర్వహిస్తారు.
డొక్కా సీతమ్మ స్మృతులు పదిలం
తరాలు మారినా..చెదరని జ్ఞాపకాలు
(పి.గన్నవరం- ఆంధ్రజ్యోతి)
నిత్యాన్నదాతగా, అపర అన్నపూర్ణగా ప్రసి ద్ధి చెందిన డొక్కా సీతమ్మ జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఆమె స్వగ్రామం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరం గ్రామంలోని ఆమె నివాసంలో నేటికీ సందర్శకులను ఆకర్షిస్తు న్నాయి. బ్రిటీషు ప్రభుత్వంతోపాటు ప్రపంచ దేశాల మన్నలను పొందిన సీతమ్మ వాడిన వస్తువులను వందేళ్లు దాటిన ఆమె వంశీ యులు ఇంకా అపురూపంగా భద్రపరిచారు. సీతమ్మ జీవిత చరిత్రను గతంలో పలు ప్రభు త్వాలు పాఠ్యాంశాలుగా ముద్రించి విద్యార్థి దశ నుంచే ఆమె సామాజిక సేవను వివరిం చేవారు. రానురాను సీతమ్మ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో తొలగించారు. ఈ తరుణంలో ఇటీ వలే ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీతమ్మ పేరు చిరస్థాయిగా నిలిచి ఉండేలా మధ్యాహ్న భోజన పఽథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పేరును సూచించి పెద్దపీట వేశారు. అయితే ఆ రోజుల్లో ఆకలి అని వచ్చిన వారికి వండి వడ్డించిన సీతమ్మ వాడిన పెద్ద పెద్ద వంట పాత్రలను గణపతి మందిరాలు, సత్రాలకు అందించారని ప్రస్తు తం ఉన్న ఐదవ తరం వారసులు చెప్పుకొ చ్చారు. ఆమె నివాసంలో ప్రస్తుతం చెక్కతో చేసిన భోషాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఆరోజుల్లో ఆ భోషాణంలో పాత్రలు, వంటసామగ్రి తదితర వస్తువులను సీతమ్మ భద్రపరుచుకునేవారు. అలాగే సీత మ్మ వాడిన కావిడి పెట్టెలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా బంగారం నగ లు, నగదు, ముఖ్యమైన వస్తువులతోపాటు చీరలను సైతం వాటిలో భద్రపరుచుకునేవా రట. ఇంకా వంట నిమిత్తం వినియోగించిన సన్నికాలు, రుబ్బురోలు కూడా అలాగే ఉన్నా యి. అంతేకాకుండా సీతమ్మ చివరి రోజుల్లో ఎక్కువగా కూర్చున్న కుర్చీతోపాటు తాగు నీరుకు వినియోగించిన నుయ్యి సైతం పెరట్లో అలాగే ఉన్నాయి. కాగా సీతమ్మ నివాసానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది.